Sunday, December 9, 2012

కోరుకున్న మొగుడు

చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

అయ్యో... అయ్యో...
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు.. మేలో మేలో ఇంటికల్లుడు
కోలో కోలో కొంటె పిల్లడు.. మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు

చరణం 1:

బంతిపూవులాంటిదాన్ని.. బావా అని వెంబడిస్తే
జావగారిపోతాడు.. ఏం తెగులో..
హోయ్ తెల్లచీర కట్టుకొని.. మల్లెపూలు పెట్టుకొస్తే
తెల్లమొహం వేస్తాడు.. ఏం గుబులో..
చక్కెర ముద్దివ్వడేమీ.. చెక్కిలైనా నొక్కడేమీ..
చక్కెర ముద్దివ్వడేమీ.. చెక్కిలైనా నొక్కడేమీ..
మాట లేదు.. మంచి లేదు.. మరదలన్న సరసం లేదు

కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
అయ్యో కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు.. మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు

చరణం 2:

ప్రేమించె ఈడువచ్చి.. పెళ్ళి పెళ్ళి అంటుంటే
తుళ్ళితుళ్ళి పడతాడు.. ఏం మగాడు
హయ్యో మేనరికంలాంటి తోడు.. మేను మేను రాసుకుంటే
మెమ్మె మెమ్మె అంటాడు.. ఏం పిల్లాడు
సన్నజాజులివ్వడేమి.. ఉన్న మోజు తెలపడేమి..
సన్నజాజులివ్వడేమి.. ఉన్న మోజు తెలపడేమి..
మంచి లేదు.. చెడ్డ లేదు.. సందె వేళ సరదా లేదు

కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు.. మేలో మేలో ఇంటికల్లుడు
కోలో కోలో కొంటె పిల్లడు.. మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు
హయ్యో కోరుకున్న మొగుడు.. నే కోరుకున్న మొగుడు

No comments:

Post a Comment