Sunday, December 9, 2012

చిలకమ్మ గోరింక సరసాలాడితే

చిత్రం: కోరుకున్న మొగుడు (1982) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

చిలకమ్మ గోరింక సరసాలాడితే 
నవ్వే యవ్వనం నాలో ఈ దినం 

చిలకమ్మ గోరింక సరసాలాడితే 
నవ్వే యవ్వనం నీదే ఈ దినం 

చరణం 1: 

పువ్వులలో పులకింతలలో చలిజింతలలో చెలరేగి 
కౌగిలిలో కవ్వింతలలో చెలి చెంతలలో కొనసాగే 

ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా 
ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా 
తొలకరి వలపుల వేళలలో 

చిలకమ్మ గోరింక సరసాలాడితే 
నవ్వే యవ్వనం నీదే ఈ దినం 

చరణం 2: 

కోరికలో దరి చేరికలో అభిసారికనై జతకూడి 
అల్లికలో మరుమల్లికలా విరిపల్లకినై కదలాడి 

ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే 
ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే 
ఎగసిన సొగసుల ఘుమఘుమలో 

చిలకమ్మ గోరింక సరసాలాడితే 
నవ్వే యవ్వనం నాలో ఈ దినం 

చరణం 3: 

అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై పెనవేసి 
మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే 

ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ 
ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ 
కలిసిన మనసుల సరిగమలో 

చిలకమ్మ గోరింక సరసాలాడితే 
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

No comments:

Post a Comment