చిత్రం: చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప
చరణం 1:
ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు
ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా ..
నీ మనుగడలో నిండాలమ్మా .. నా కలలన్ని పండాలమ్మా
అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప
చరణం 2:
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే
తోడై నీడై లాలించునులే .. మనకే లోటు రానీయదులే
అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప
ల ల లాలి ..ల ల లాలి
ల ల లాలి ..ల ల లాలి
No comments:
Post a Comment