చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఇట్టుల చింతింతువే టొమేటో అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . . ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసమూ చరణం 1: ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి మధ్య నలిగినాడు మాధవుండు ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . . ఆ . . ఓ . . జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ ఆ . . . చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసమూ ఓ . . . చరణం 2: రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము ఆ . . . ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసమూ | |
Tuesday, January 22, 2013
ఒకటే హృదయం కోసము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment