Wednesday, July 17, 2013

పూచిన తారలు పూవులుగా

చిత్రం: జోకర్ (1993) 
సంగీతం: వంశీ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

పూచిన తారలు పూవులుగా 
దోచిన చీకటి తుమ్మెదగా 
జాము వేచింది నాలా జాబిలీ జాగు ఏలా 
వేగిపోవాలి నాలా వేచి దోచాలీ నీలా 
తీరనీ తాపము చేరనీ తీరమూ 

పూచిన తారలు పూవులుగా 
దోచిన చీకటి తుమ్మెదగా 
జాజులా జాములోన జాబిలై నేను రానా 
చేరుకోవాలి నీలా సేద తీరాలి నాలా 
తీరనీ తాపము చేరనీ తీరమూ 

చరణం 1: 

తార దారాలు తీసి చూపు రాట్నాలనేసి 
చీరగారాలు చూపి నీకు జోహారు చేసి చేసి 
తేనె మారాలు తీసి పులవాలేటి వాని 
రూపు నీలోన చూసి ప్రేమవారాసి రాశి పోసి 
చూసి చూసి చూపే దోచి ఆశా ఆశ ఆరా తీసి 
తీరా మోజు తీరే రోజు ఆగేవేళ ఆపేవేళ పాడేకోయిలా 
రావే రాధికా ప్రేమే నీదికా 
ఏదీ కానుకా తేనే నీదిగా 

పూచిన తారలు పూవులుగా 
దోచిన చీకటి తుమ్మెదగా 
జాము వేచింది నాలా జాబిలీ జాగు ఏలా 
వేగిపోవాలి నాలా వేచి దోచాలీ నీలా 
తీరనీ తాపము చేరనీ తీరమూ 

చరణం 2: 

చూపు గారాము చూసి మాట మారాము చేసి 
మారు మాటాడలేక కోరి నీ దారి చేరి చేరి 
మాకు మారాకు వేసి పూత పూదోట పూసి 
మాపు మారాక తోటి రేపు కాలేక వేచీ వేచీ 
వేచేవాడు కాచేరేడు వీడే వాడు కానేకాడు 
ఈడే నేడు దోచేవాడు తానే జోడు ఆడీ పాడీ తోడూ నీడగా 
నీవే మాలిగా రావే మాలికా 
తీరే కోరికా లోటే లేదికా 

పూచిన తారలు పూవులుగా 
దోచిన చీకటి తుమ్మెదగా 
జాజులా జాములోన జాబిలై నేను రానా 
చేరుకోవాలి నీలా సేద తీరాలి నాలా 
తీరనీ తాపము చేరనీ తీరమూ

No comments:

Post a Comment