Wednesday, July 17, 2013

పాలనవ్వులలోన పగడాల వెలుగులు

చిత్రం: జోకర్ (1993)
సంగీతం: వంశీ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

చరణం 1:

చిలిపి మాటలు చిలికే పాట పేరడి
చురుకు చేతిలో తిరిగే పేక గారడి
చిట్టిపాప బెట్టు అది హాటు ట్రాజెడి
రట్టుచేయి బెట్టు ఇది స్వీటు కామెడి
గువ్వ నువ్వు నేను నవ్వే నవ్వులోన
పువ్వు పువ్వు వాన జల్లాయెను
కయ్యాలు నేటికి కట్టాయెను
చిన్నారి ఆటల పుట్టాయెను

పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

చరణం 2:

తగువుపాపతో చెలిమి చేసి జోకరు
బిగువులాగితే పొంగి పోయే హ్యూమరు
ఎత్తువేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తుచేసి నావే ఎదలోని బంధమా
చిన్న చిన్న లేత పొన్నా పొన్నా
ప్రేమకన్న మిన్న లేదు లేదోయన్న
కుందేలు జాబిలి ఫ్రెండాయెను
అందాల స్నేహము విందాయెను

పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

No comments:

Post a Comment