Friday, July 26, 2013

ఘడియకో కౌగిలింత

చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా.. అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే

ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత

చరణం 1:

వెంటాడె వయ్యారి రూపు దీపాలు పెట్టేటి వేళా
వేధించె నీ కొంటె చూపు వెన్నెల్లు కాసేటి వేళా
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
నీ ఒడి చేర్చి కోరిక తీర్చి లాలించవే పాలించవే...
లాలించవే పాలించవే

ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే
ఘడియకో కౌగిలింత గంటకో పులకరింత

చరణం 2:

సన్నాయి మోగింది నాలో చినుకల్లె నే తాకగానే
చలిమంట రేగింది నాలో వెచ్చంగ చేయ్ సోకగానే
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
కౌగిట చేర్చి వేడుక తీర్చి లాలించనా పాలించనా...
లాలించనా పాలించనా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
ఒకటైతే ఇద్దరమొకటైతే...
ఆ... ఒకటైతే.. ఇద్దరమొకటైతే... ఆ..ఆ

కళ్ళల్లో కాంతుల వానా..
పెదవులపై నవ్వుల వానా..
వలపే పువ్వుల వానా..
నీపైన నా పైన కురిసింది జడివాన..
పరువాల పెదవానగా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
వానలో కౌగిలింత మేనిలో 
పులకరింత

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9342

No comments:

Post a Comment