Friday, July 26, 2013

జగమంతా మారినది జవరాలా

చిత్రం: దేవాంతకుడు (1960)
సంగీతం: అశ్వత్థామ
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, జానకి

పల్లవి:

జగమంతా మారినది జవరాలా నీ..వలన
జగమంతా మారినది జవరాలా నీవలన

జన్మమే తరించినది జతగాడా నీ..వలన
జన్మమే తరించినది జతగాడా నీవలన
జన్మమే తరించినది....

చరణం 1:

అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది
అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది
కనులముందు స్వర్గమే...
కనులముందు స్వర్గమే గజ్జెకట్టి ఆడినది ..గజ్జెకట్టి ఆడినది

జగమంతా మారినది జవరాలా నీ..వలన

చరణం 2:

దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
తీయని హాయిలో మనసు
తీయని హాయిలో మనసు తేలి తేలి సోలినది .. తేలి తేలి సోలినది

జన్మమే తరించినది జతగాడా నీ..వలన

చరణం 3:

రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
చక్కని లోకాలు జయించి ...
చక్కని లోకాలు జయించి సామ్రాజ్య లేలినవి ..సామ్రాజ్య లేలినవి

జగమంతా మారినది... నిజమైన ప్రేమ వలన... జగమంతా మారినది...



No comments:

Post a Comment