Monday, August 12, 2013

తీయని ఊహలు


చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: లీల


పల్లవి:

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 1:

    చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
    చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా

    వని అంతా పరిమళించేనే మనసంతా పరవశించెనే
    వని అంతా పరిమళించేనే మనసంతా పరవశించెనే

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 2:

    గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
    గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా

    వని అంతా జలజలరించేనే తనువెంతో పులకరించెనే

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 3:

    ఓ... ఓ.... ఓ... ఓ ...
    కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
    కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా

    వని అంతా రవళించేనే తనువెంతో మురిపీంచేనే

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

No comments:

Post a Comment