Tuesday, October 29, 2013

నిన్నలేని అందమేదో



చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదుర లేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీయ సాగెనెందుకో... తీయ సాగెనెందుకో.. నాలో...
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదుర లేచెనెందుకో

చరణం 1:

పూచిన ప్రతి తరువొక వధువూ
పువుపువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

చరణం 2:

తెలి నురుగులె నవ్వులుకాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదురలేచెనెందుకో

చరణం 3:

పసిడి అంచు పైట జారా
ఆ... ఓ...
పయనించే మేఘ బాల
అరుణ కాంతి సోకగానే పరవశించెనే

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1566

No comments:

Post a Comment