Monday, January 13, 2014

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా

చిత్రం:  బంగారు కలలు (1974)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:  ఆరుద్ర
నేపధ్య గానం:  రామకృష్ణ, సుశీల

పల్లవి:

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
చెలికానిపై అలకెందుకే.. నీ జతగానితో తగవెందుకే..

చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా...
వలపే కానీ నీపై అలక లేదింకా
అనురాగమే గెలిచిందిలే.. నీ మనసేమిటో తెలిసిందిలే..

చరణం 1:

గగనాన మేఘం తొలగిందిలే...
రవి మోము నేడు వెలిగిందిలే..
గగనాన మేఘం తొలగిందిలే...
రవి మోము నేడు వెలిగిందిలే..

అనుమానాలు తీరాలి.. అభిమానాలు పెరిగాయి..
అనురాగమే గెలిచిందిలే.. నీ మనసేమిటో తెలిసిందిలే..

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
చెలికానిపై అలకెందుకే..

చరణం 2:

నా ప్రేమగీతం.. నీవేలే
ఆపాతభావం.. నీవేలే...
నా ప్రేమగీతం.. నీవేలే
ఆపాతభావం.. నీవేలే...

కమ్మని రాగం నీవైతే.. కలిసిన తాళం నీవైతే...
ఆ గానమే.. మన ప్రాణము..
నీ మీదనే... నా ధ్యానము..

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
చెలికానిపై అలకెందుకే..

చరణం 3:

నీ బుగ్గ మీద నే చుక్కనే..
పాదాల పైనా పారాణినే...
నీ బుగ్గ మీద నే చుక్కనే..
పాదాల పైనా పారాణినే...

పచ్చని పెళ్ళిపందిరిలో.. ముచ్చట గొలిపే సుందరినే...
ఈనాటితో నవజీవనం... మన జీవితం బృందావనం...

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
అనురాగమే గెలిచిందిలే..
నీ మనసేమిటో తెలిసిందిలే..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1756


No comments:

Post a Comment