Friday, February 28, 2014

అమ్మ అన్నది ఒక కమ్మని మాట

చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, లత


పల్లవి:

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...మమతలమూట

చరణం 1:

దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు

తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..మమతలమూట

చరణం 2:

అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా

అమ్మ మనసు అమృతమే నిండురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...మమతలమూట

చరణం 3:

అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4509

2 comments: