Tuesday, March 18, 2014

ఏమని పాడెదనో ఈ వేళా

చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల


పల్లవి:


ఏమని పాడెదనో ఈ వేళా...
ఏమని పాడెదనో ఈ వేళా...
మానస వీణ మౌనముగా నిదురించిన వేళా...
ఏమని పాడెదనో...


చరణం 1:


జగమే మరచి హృదయ విపంచి...
జగమే మరచి హృదయ విపంచి...
గారడిగా వినువీధి చరించీ...
గారడిగా వినువీధి చరించీ...
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా...


ఏమని పాడెదనో...


చరణం 2:


వనసీమలలో హాయిగా ఆడే...
వనసీమలలో హాయిగా ఆడే...
రాచిలుక నిను రాణిని చేసే...
రాచిలుక నిను రాణిని చేసే...
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచే వేళా... 


ఏమని పాడెదనో ఈ వేళా...
ఏమని పాడెదనో ఈ వేళా...
మానస వీణ మౌనముగా నిదురించిన వేళా...
ఏమని పాడెదనో... ఓ.. ఓ..  


No comments:

Post a Comment