Sunday, March 16, 2014

ఓహో మేఘమలా నీలాల మేఘమాలా

చిత్రం :  భలే రాముడు (1956)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:

అతడు :

ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా

వినీలా మేఘమాలా... వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా...
నిదురపోయే రామచిలుకా..
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా

చరణం 1:

అతడు :

ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ...ఈ...ఈ...
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..ఈ..ఈ...
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ

ఏం?..నిదురపోయే రామచిలుకా
..నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా...

చరణం 2:

అతడు :


ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ

ఆమె:

ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ

ఆశలన్నీ తారకలుగా హారమొనరించి...ఈ..ఈ...
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
అలంకారమొనరించి...

మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి..
పారిపోతావా దొంగా... పారిపోతావా...

చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1502

No comments:

Post a Comment