Showing posts with label సదాశివబ్రహ్మం. Show all posts
Showing posts with label సదాశివబ్రహ్మం. Show all posts

Monday, August 6, 2018

ఊరకే కన్నీరు నింప

చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపథ్య గానం :  లీల, సుశీల 






పల్లవి :


ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవి విదేమమ్మా 




చరణం 1 : 


శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
కోరితే బంగారు కొండ కొని తేగలమమ్మా



ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా 



చరణం 2 : 


తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
వల్లకాదు చెప్పకున్న వదలము నీ పాదములా 




ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడ విదేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా 




Monday, December 4, 2017

ఒహో మేఘమాలా

చిత్రం :  భలే రాముడు (1956)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :   పి. లీల



పల్లవి :


ఒహో మేఘమాలా... ఆ... ఆ... ఆ... ఆ.... నీలాల మేఘమాల
చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
మెల మెల్లగ రావేలా


వినీల దుడుకుతనమేలా
వినీల దుడుకుతనమేలా... ఆ...  ఆ
ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగ రావేలా ...  మెల్లగ రావేలా




చరణం 1 :



ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గూటిలోన రామచిలుక నిదురపోతోంది
గూటిలోన రామచిలుక నిదురపోతోంది
చిలుక బెదిరిపోతుంది


ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగ రావేలా ...  మెల్లగ రావేలా



చరణం 2 :



ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తీయతీయని కలలు కంటూ మురిసిపోతుంది
తీయతీయని కలలు కంటూ మురిసిపోతుంది
మైమరచిపోతుంది


ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా...  ఉరుముతావేల మెరవగానేలా


చల్లగ రావేలా ..మెల్లగ రావేలా
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1138

Thursday, May 19, 2016

గోపాల జాగేలరా








చిత్రం : భలే అమ్మాయిలు (1957)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల



పల్లవి :


గోపాల జాగేలరా.. బాలగోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా...  నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా



దరిజేర చలమేలరా...ఆ...ఆ..ఆ..ఆ..
దరిజేర చలమేలరా... నన్ను దయజూడ విధియేమిరా
దరిజేర చలమేలరా... నన్ను దయజూడ విధియేమిరా
మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర
గోపాల జాగేలరా.. 




చరణం 1 : 


కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి 



కనుగొని ప్రేమించి నిను జేరినా
ఆ...ఆ......ఆ......ఆ......ఆ...
కనుగొని ప్రేమించి నిను జేరినా
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనుగొని ప్రేమించి నిను జేరినా
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలరా
మురళీధర కరుణాకర గిరిధర.. గోపాల జాగేలరా
సరిగపద... గోపాల జాగేలరా
సదపగరి సరిగపద... గోపాల జాగేలరా
పగరిసదా సరిగపద... గోపాల జాగేలరా


దాసరి పాదస పా సరిగపద ... గోపాల జాగేలరా
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద... గోపాల జాగేలరా
సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద... గోపాల జాగేలరా
రీగ రిగ రీరీ... ఆ...ఆ...ఆ...ఆ...


రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని.... గోపాల జాగేలరా
నిస్సనినిసా...ఆ...ఆ...ఆ...ఆ...
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని.... గోపాల జాగేలరా


గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా... ఆ...ఆ...ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ...ఈ...ఈ... ఈ
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ... గోపాల 


మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద...  జాగేలరా
రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని... గోపాల జాగేలరా



గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ...


రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా...
గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద.... గోపాల జాగేలరా






Sunday, March 16, 2014

ఓహో మేఘమలా నీలాల మేఘమాలా

చిత్రం :  భలే రాముడు (1956)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:

అతడు :

ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా

వినీలా మేఘమాలా... వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా...
నిదురపోయే రామచిలుకా..
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా

చరణం 1:

అతడు :

ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ...ఈ...ఈ...
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..ఈ..ఈ...
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ

ఏం?..నిదురపోయే రామచిలుకా
..నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా...

చరణం 2:

అతడు :


ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ

ఆమె:

ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ

ఆశలన్నీ తారకలుగా హారమొనరించి...ఈ..ఈ...
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
అలంకారమొనరించి...

మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి..
పారిపోతావా దొంగా... పారిపోతావా...

చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1502

మది ఉయ్యాలలూగే

చిత్రం : భలే అమ్మాయిలు (1957)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:

మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహో...
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహొ...
మది ఉయ్యాల...


ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 1:

తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా
నూతన యవ్వన సమయమున
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 2:

చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోనా
చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోనా

ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 3:

ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా ఆ
రేయి పగలు నే నిను మురిపించి నిను వలపించి
ప్రేమ జగానికి కొనిపోనా

మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=507

Tuesday, August 21, 2012

చల్లనిరాజా ఓ చందమామా





చిత్రం : ఇలవేలుపు (1956) 
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచయిత : సదాశివబ్రహ్మం 
నేపథ్య గానం: పి. లీల, రఘునాథ్ పాణీగ్రాహి, సుశీల  


పల్లవి : 

చల్లనిరాజా ఓ చందమామా 
చల్లనిరాజా ఓ చందమామా 
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా.. నా చందమామా 

చల్లనిరాజా ఓ చందమామా 
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా.. నా చందమామా  



చరణం 1 : 


పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాలనాడేటి పూబంతివి 
పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాలనాడేటి పూబంతివి 
నిను సేవించెదా నను దయచూడవా 
ఓ వెన్నెల వన్నెల నా చందమామ 


చల్లనిరాజా ఓ చందమామా 
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా... నా చందమామా 


చరణం 2 : 


చల్లనిరాజా ఓ చందమామ 
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామ నా చందమామ

నిను చూచిన మనసెంతో వికసించుగా 
తొలి కోరికలెన్నో చిగురించుగా 
ఆశలూరించునే చెలి కనిపించునే 
చిరునవ్వుల వెన్నెల కురిపించులే...ఓ... 


చల్లనిరాజా ఓ చందమామా 

చల్లనిరాజా ఓ చందమామా
చల్లనిరాజా ఓ చందమామా
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామ నా చందమామ 



చల్లనిరాజా ఓ చందమామ 
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా నా చందమామా


నిను చూచిన మనసెంతో వికసించుగా 
తొలి కోరికలెన్నో చిగురించుగా 
ఆశలూరించునే చెలి కనిపించునే 
చిరునవ్వుల వెన్నెల కురిపించులే...ఓ... 



చల్లనిరాజా ఓ చందమామా
చల్లనిరాజా ఓ చందమామా
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా నా చందమామా 



చరణం 3 : 


నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను అబలను ప్రియురాలను 
నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను అబలను ప్రియురాలను 
నిన్నే కోరానురా నన్నే కరుణించరా 
ఈ వెన్నెల కన్నెతో విహరించరా...ఆఆ... 



చల్లనిరాజా ఓ చందమామా 
నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా... నా చందమామా