చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 1:
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటినై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 2:
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా.. దాహమా.. చింతలా.. వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..
ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా...
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1368
super
ReplyDeletesuper
ReplyDeleteచరణం-1:
ReplyDeleteపగడాల చిగురాకు తెరచాటు తేటినై — అనుకుంటానండీ.
‘తేటి’ అంటే భ్రమరము.
చరణం-2:
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
‘చదలు’ అంటే ఆకాశము, ‘జలదము’ అంటే మబ్బు
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా
‘కరణి’ అంటే విధము (manner)
By the way I attempted it here - http://bit.ly/2WsgSAK
Hope you like it.
చాలా థాంక్స్ మహేష్ గారు! సరి చేశాను. పాట చాలా బాగా పాడారు. అభినందనలండి.___/\__
Deleteధన్యవాదాలు అండీ __/\__
Delete