Friday, April 11, 2014

ప్రియరాగాలే గుండెలోన

చిత్రం :  హలో బ్రదర్ (1994)
సంగీతం : రాజ్-కోటి
నేపధ్య గానం : బాలు,  చిత్ర


పల్లవి:



ఆమె :  ఓ...ఓ...ఓ...ఓ..

అతడు :  ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా

ఆమె :  ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

అతడు :  చేరాలి సొగసుల తీరం... 

ఆమె :  సాగాలి తకధిమి తాళం

అతడు :  తగ్గాలి తనువుల దూరం... 

ఆమె :  తీరాలి వయసుల తాపం.. 

అతడు :  ఓ....ఓ...ఓ...ఓ...

ఆమె  :  ఓ....ఓ...ఓ...ఓ...


అతడు :  ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా

ఆమె :  ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా




చరణం 1:

అతడు :   అల్లరి కోయిల పాడిన పల్లవి... 

            స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా


ఆమె :   వేకువ పూచిన తొలితొలి గీతిక

            ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా

అతడు : కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని..

ఆమె : కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..

అతడు : ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా.. 

ఆమె :  తొలి ప్రేమలే దోచుకోనా..

అతడు :  ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా

ఆమె :   ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా


చరణం 2:

ఆమె :  సవ్వడి చేయని యవ్వన వీణలు

            అలా అలా సవరించు... పదే పదే పలికించు

అతడు :  వయసులు కోరిన వెన్నెల మధువులు

              సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు

ఆమె :  పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..

అతడు : ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా

ఆమె :  ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ.. 

అతడు :  పడుచాటలే సాగిపోని..

అతడు :  ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా

ఆమె :  ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

అతడు :  చేరాలి సొగసుల తీరం... 

ఆమె :  సాగాలి తకధిమి తాళం..

అతడు :  తగ్గాలి  తనువుల దూరం... 

ఆమె :  తీరాలి వయసుల తాపం

అతడు :  ఓ....ఓ...ఓ...ఓ...

ఆమె :  ఓ....ఓ...ఓ...ఓ...


No comments:

Post a Comment