Saturday, June 28, 2014

మనసే కోవెలగా

చిత్రం :  మాతృదేవత (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా.. కృష్ణా.. 
ఆ..ఆ..

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా.. కృష్ణా.. 
 ఆ..ఆ..

మనసే కోవెలగా.. అహా.. ఆ.. అహ.. ఆ..


చరణం 1:


ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మదినిండాలీ కలలన్నీ పండాలి
కలకాలం మదినిండాలీ కలలన్ని పండాలి
మన కలలన్ని పండాలి


మనసే కోవెలగా మమతలు మల్లెలుగా


చరణం 2:


ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపే
ము

ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము


మనసే కోవెలగా మమతలు మల్లెలుగా


చరణం 3:


నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి


మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా కృష్ణా.. ఆ..ఆ..

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా..


No comments:

Post a Comment