Showing posts with label Kamal Hasan. Show all posts
Showing posts with label Kamal Hasan. Show all posts

Tuesday, September 20, 2016

ధర్మం శరణం గచ్ఛామి






చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ 





పల్లవి  :



ధర్మం... శరణం గచ్ఛామి దానం... శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి



ఇంతో అంతో... ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం....  లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి




చరణం 1 :



తెల్ల వారితే కూడు దక్కకా... పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కకా...  పొద్దు వాలితే గూడు చిక్కకా
బాధలు మోసే అభాగ్యులం... బతుకులు ఈడ్చే అనాథలం
అభాగ్యులం అనాథలం...  అభాగ్యులం అనాథలం




ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి




చరణం 2  :




కన్నవారికి కానివారమై... ఈ.... ఈ.... ఈ.
కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో .... ఎన్ని కాళ్ళకు మొక్కామో
అభాగ్యులం అనాథలం .... అభాగ్యులం అనాథలం



ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5660

Friday, September 9, 2016

చిన్నారి పొన్నారి కిట్టయ్య






చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, జానకి 




పల్లవి :


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య 


అమ్మ నన్ను కొట్టింది బాబోయ్...  అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న...  నిన్నూరడించ నేనున్నా 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా 




చరణం 1 :



నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరొక
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్లితివేమో...   మన్నుతిని చాటుగా దాగితివేమో 

అమ్మ మన్నుతినంగ నే చిచువునో  ఆకొంతినో  వెల్లినో చూదు నోలు ఆఆ
వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామే కోపంరా 

పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా 

వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది
పచ్చికొట్టిపోయామా  పాలెవలు ఇస్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు  చెప్పు 


అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు  




చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టరునాన్నా... ఎవరమ్మా 





చరణం 2 :




చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టెను...  పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పెను
యశోదను కానురా నిను దండించ...  సత్యను కానురా నిను సాధించ
ఎవ్వరు నువ్వని..  ఈ..  ఈ ..... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు
ఎవరు కానని విడిచి వెళ్లకు...  నన్ను విడిచి వెళ్లకు
వెళ్ళము వెళ్ళములేమ్మ




చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య 


అమ్మ నన్ను కొట్టింది బాబోయ్...  అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న... అహా.. ఊరుకోను.. 
 నిన్నూరడించ నేనున్నా 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5773





Monday, August 1, 2016

తకధిమితక ధిమితకధిమి




చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, రమోల 


పల్లవి :  



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్ 

మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం


ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్





చరణం 1 :




ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ


ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్




చరణం 2 :



వెళ్తారు వెళ్ళేటివాళ్ళు...  చెప్పేసెయ్ తుది వీడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు...  వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు 



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్




చరణం 3 : 




ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు


ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు




తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం





కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5611

Tuesday, July 26, 2016

కాచుకొంటి కాచుకొంటి







చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు




పల్లవి : 


What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting 



చరణం 1 :


కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ




What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting 




చరణం 3 :


కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5630

Tuesday, November 11, 2014

ఎర్రగులాబీ విరిసినది

చిత్రం :  ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి  



పల్లవి :

రురూరురూ.. రురురురూ..రురురురురురు..
ఎర్రగులాబి విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది.. 


చరణం 1 :


లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా


నేనిక నీకే సొంతము
న న న న న నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది ..


చరణం 2 :


పెదవిని... ఈ మధువునూ నేడే చవిచూడనీ

నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా


వయసుని వయసే దోచేది
న న న న న న అది మనసుంటేనే జరిగేది
న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..నననన.. నననన..అహహా...  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5756

Thursday, October 16, 2014

సువ్వి సువ్వి సువ్వాలమ్మా

చిత్రం : స్వాతిముత్యం (1986)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : సినారె

నేపథ్య గానం  :  బాలు,  జానకి  


పల్లవి :


ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...

ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....

చాల బాగా పాడుతున్నారే

ఆ... పైషఢ్యం...

మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ


ని స రి మ ప ని స రి ని రి రి స

ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..

తానననా... తానా...న తదరే.... నా.... ఆ....


సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..

గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా...

సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...

గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా...ఆ... ఆ..... ఆ.........

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

చరణం 1 :


అండా దండా ఉండాలని.. కోదండ రాముని నమ్ముకుంటే

అండా దండా ఉండాలని.. కోదండ రాముని నమ్ముకుంటే

గుండే లేని మనిషల్లే.. నిను కొండా కోనల కొదిలేశాడా

గుండే లేని మనిషల్లే...

గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా

 

అగ్గీ లోనా దూకి.. పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు

నేగ్గేవమ్మా ఒక నాడు.. నింగి నేల నీ తోడు

నేగ్గేవమ్మా ఒక నాడు.. నింగి నేల నీ తోడు

 

సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

చరణం 2 :


చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా

చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా

ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా

ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా

పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ

వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు

వస్తుందమ్మా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు

సువ్వి సువ్వి సువ్వీ.... 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5775

వటపత్ర శాయికి వరహాల లాలి

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  సుశీల   


పల్లవి :


లాలి లాలి లాలి లాలి...

లాలి లాలి లాలి లాలి...


వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి... రతనాల లాలి

వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి... రతనాల లాలి

మురిపాల కృష్ణునికి.. ఆ... ఆ... ఆ...

మురిపాల కృష్ణునికి... ముత్యాల లాలి

జగమేలు స్వామికి.... పగడాల లాలి...


వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి.... రతనాల లాలి

లాలి లాలి లాలి లాలి...

లాలి లాలి లాలి లాలి...


చరణం 1 :


కళ్యాణ రామునికి... కౌసల్య లాలి

కళ్యాణ రామునికి... కౌసల్య లాలి

యదువంశ విభునికి... యశోద లాలి

యదువంశ విభునికి.... యశోద లాలి

కరిరాజ ముఖునికి...

కరిరాజ ముఖునికి... గిరితనయ లాలి

కరిరాజ ముఖునికి... గిరితనయ లాలి

పరమాంశ భవునికి... పరమాత్మ లాలి


వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి... రతనాల లాలి


జోజో... జోజో... జో...

జోజో... జోజో... జో...


చరణం 2 :


అలమేలు పతికి... అన్నమయ్య లాలి

అలమేలు పతికి... అన్నమయ్య లాలి

కోదండ రామునికి... గోపయ్య లాలి

కోదండ రామునికి... గోపయ్య లాలి

శ్యామలాంగునికి... శ్యామయ్య లాలి

శ్యామలాంగునికి... శ్యామయ్య లాలి

ఆగమనుతునికి... త్యాగయ్య లాలి


వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి... రతనాల లాలి

మురిపాల కృష్ణునికి... ముత్యాల లాలి

జగమేలు స్వామికి... పగడాల లాలి


వటపత్ర శాయికి... వరహాల లాలి

రాజీవ నేత్రునికి... రతనాల లాలి

లాలి లాలి లాలి లాలి...

లాలి లాలి లాలి లాలి... 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6647

రామా కనవేమిరా

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

నేపథ్య గానం :  బాలు,  శైలజ  


పల్లవి :


రామా కనవేమిరా....

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ......

రామా కనవేమిరా...

రమణీ లలామ... నవ లావణ్య సీమ

ధరాపుత్రి.. సుమ గాత్రి

ధరాపుత్రి సుమ గాత్రి ... నడయాడి రాగా

రామా కనవేమిరా


సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని

సభాసదులందరు పదే పదే చూడగా

 శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట 

తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

రామా కనవేమిరా...

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ...

రామా కనవేమిరా...

 

రమణీ లలామ నవ లావణ్య సీమ....  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రమణీ లలామ నవ లావణ్య సీమ

ధరాపుత్రి.. సుమ గాత్రి

ధరాపుత్రి సుమ గాత్రి...  నడయాడి రాగా

రామా కనవేమిరా...


చరణం 1 :


ముసిముసి నగవుల రసిక శిఖామణులు

సా ని ద మ ప మ గ రి స

ఒసపరి చూపుల అసవిష   విక్రములు

స గ రి గ మ ని ద మ ని ని

ముసిముసి నగవుల రసిక శిఖామణులు.. తా తకిట తక జణుత

ఒసపరి చూపుల అసవిష  విక్రములు

తకజణు తకధిమి తక

మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మా గ రి గ మ

మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ...  ఆహ

క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే... ఒక యుగమై

తరుణి వంక శివ..  ధనువు వంక.. తమ తనువు మరచి కనులు తెరచి చూడగ


రామా కనవేమిరా... కనవేమిరా...


చరణం 2 :

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు

తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు

తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు.. అహ గుండెలు జారిన విభులు

విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు

తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి... వొగ్గెసిన పురుషాద్గణులు


ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా...

ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..

అరెరె ఎత్తే వారు లేరా.. అ... విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..

అహ ఎత్తే వారు లేరా ... అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా

తకద తైయ్యకు తా ధిమి తా..


చరణం 2 :


రామాయ.. రామభద్రాయ.. రామచంద్రాయ నమః


అంతలో రామయ్య లేచినాడు.. ఆ వింటి మీద చెయ్యి వేసినాడు

అంతలో రామయ్య లేచినాడు... ఆ వింటి మీద చెయ్యి వేసినాడు

సీతవంక ఓరకంట చూసినాడు... సీతవంక ఓరకంట చూసినాడు

ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు

చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు

పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనువుకళలొలికెను సీతానవవధువు

జయజయరామ రఘుకులసోమా

జయజయరామ రఘుకులసోమా

దశరధరామా దైత్యవిరామా

దశరధరామా దైత్యవిరామా

జయజయరామ రఘుకులసోమా

దశరధరామా దైత్యవిరామ


సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే

సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే

కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే

కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే

సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే


రామయ్య.. అదుగోనయ్య..

రమణీ లలామ... నవ లావణ్య సీమ

ధరాపుత్రి సుమ గాత్రి.. నడయాడి రాగా

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా...

రామా కనవేమిరా...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5648

మనసు పలికె మౌన గీతం

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత:     సినారె

నేపథ్య గానం :  బాలు, జానకి  


పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
మనసు పలికె...  మనసు పలికే
మౌనగీతం...  మౌనగీతం
మనసు పలికె.. మౌన గీతం.. నేడే


మమతలొలికే...  మమతలొలికే

స్వాతిముత్యం...  స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం... నీవే

 

అణువు అణువు...  ప్రణయ మధువు

అణువు అణువు... ప్రణయ మధువు

తనువు...  సుమధనువు


మనసు పలికె... మౌన గీతం...  నేడే

మమతలొలికె స్వాతిముత్యం... నీవే


చరణం 1 :


శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ... మరుల జలకాలాడనీ

సగము మేన  గిరిజనై పగలు రేయి ఒదగనీ... పగలు రేయి ఒదగనీ


హృదయ మేళనలో...  మధుర లాలనలో

హృదయ మేళనలో...  మధుర లాలనలో

వెలిగిపోని...  రాగ దీపం

వెలిగిపోని రాగ దీపం...  వేయి జన్మలుగా.... 


మనసు పలికె మౌన గీతం...  నేడే
మమతలొలికె స్వాతిముత్యం...  నీవే



చరణం 2 :



ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ... ఓనమాలు దిద్దనీ

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ... మొదటి తీపి ..

లలిత యామినిలో...  కలల కౌముదిలో
లలిత యామినిలో...  కలల కౌముదిలో


కరిగిపోని కాలమంతా...
కరిగిపోని కాలమంతా...  కౌగిలింతలుగా

 

మనసు పలికె... మనసు పలికె
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికె మౌన గీతం... నేడే
మమతలొలికె... మమతలొలికె
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికె స్వాతిముత్యం... నీవే
అణువు అణువు... ప్రణయ మధువు
అణువు అణువు... ప్రణయ మధువు
తనువు.... సుమధనువు



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5774

పట్టుసీర తెస్తనని

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

నేపథ్య గానం :  బాలు,  శైలజ  




పల్లవి :



పట్టుసీర తెస్తనని..ఈ..ఈ..ఈ

పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ

పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ

గట్టుసేరే దాకా అట్టగే ఉండు

పట్టపగలల్లే ఓ సందమావాఁ

పట్టపగలల్లే ఓ సందమావాఁ

తననన నానా తానాని నన

తననన..



చరణం 1 :




 తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా

తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా

 

ఆలినయ్యే దాకా యెల్లిపోమాకా

ఎన్నెల్లమ్మ తోడు సందమావాఁ

ఎన్నెల్లమ్మ హొయ్ తోడు సందమావాఁ

ఎన్నెలమ్మ.. అబ్బ..స్స్




Thursday, October 9, 2014

అబ్బో నేరేడు పళ్ళు

చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి 



పల్లవి :


అబ్బో...
అబ్బో...  నేరేడు పళ్ళు
అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే  పోకళ్ళు
కైపెక్కే  ఆకళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళు


అబ్బో నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు...  అల్లో నేరేడు పళ్ళు


ఆ..హా.. హేహే... యాయయయాయయా.. యా...


అమ్మో..  గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు...  యెదలోన ఎక్కిళ్ళు
కోరేది కొబ్బరి నీళ్ళు


అమ్మో గులాబి ముళ్ళు..
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు... హా



చరణం 1 :


ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా...  విరజాజి విరబూసి పోతుంటే
ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా...  విరజాజి విరబూసి పోతుంటే
నూనూగు మీసాలు... చేస్తున్నా మోసాలు
నే తాళలేనమ్మా ఈ రోజు
నే సైపలేనమ్మా ఆ ఫోజు


పగటి చుక్క అమ్మాయి... వగలమారి సన్నాయి
మోహాలు దాహాలు... నాలో చెలరేగుతున్నాయి 


అమ్మో...  గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు


అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు... 
హా 


చరణం 2 :


ఆ.. అహా.. ఏ.. రహా...
లలలలలలలలలా.... లలలలలలలలలా 


ఆ జడ పొడుగు... మెడ నునుపు చూస్తుంటే..
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే
ఆ జడ పొడుగు... మెడ నునుపు చూస్తుంటే
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే
నీలోని అందాలు...  వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మా ఈ రోజు
నేనాపలేనమ్మా ఆ మోజు


పదును చూపు అబ్బాయి...  పగలు చుక్క రాదోయి
మూడు ముళ్ళు పడేదాక... కాస్త... 
అ... నువ్వు ఆగవోయి.. అహా


అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే పోకళ్ళు
కైపెక్కే ఆకళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళు



ఎరుపెక్కే చెక్కిళ్ళు...  యెదలోన ఎక్కిళ్ళు

కోరేది కొబ్బరి నీళ్ళు...

అమ్మో గులాబి ముళ్ళు.. అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు


యాయయయాయయా... యయాయ... యాయయయాయయా

యాయయయాయయా... యయాయ... యాయయయాయయా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5758

Wednesday, September 24, 2014

బాల.. కనకమయ చేల

చిత్రం :  సాగర సంగమం (1982)
సంగీతం :
ఇళయరాజా

గీతరచయిత :  త్యాగయ్య
నేపధ్య గానం :  జానకి 




పల్లవి : 


బాల.. కనకమయ చేల... సుజన పరిపాల
కనకమయ చేల.. సుజన పరిపాల..
కనకమయ చేల.. సుజన పరిపాల..
శ్రీ రమాలోల.. విధృత శరజాల
శుభద కరుణాలవాల..
ఘననీల నవ్యవనమాలికాభరణ
ఏలా... నీ దయ రాదు...
పరాకు జేసే వేళా... సమయము గాదు... 



చరణం 1 : 


రారా... రారా... రారా...
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ


రారా.. రాజీవ నేత్ర.. రఘు వర పుత్ర
సారతర సుధా పూర హృదయ...
రారా... రారా...
సారతర సుధా పూర హృదయ...
పరివార జలధి గంభీర
దనుజ సంహార.. దశరథ కుమార
బుధ జన విహార.. సకల శ్రుతి సార.. నాదుపై...
ఏలా.. నీ దయ రాదు...
పరాకు జేసే వేళా సమయము గాదు...


ఏల నీ దయ రాదు...
పరాకు జేసేవేల సమయము గాదు


తకిట తదిమి తందాన

చిత్రం :  సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు 


పల్లవి :


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన


తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి...


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన 



చరణం 1 : 


నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసే వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసి తెలియని ఆశల లలలాలలలా
ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి..
గుండియలను అందియలుగా చేసి...


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తరికిటతోం తరికిటతోం తరికిటతోం
తడిసిన పెదవుల రేగిన.. ఆ.. ఆ.. ఆ..
శృతిని లయని ఒకటి చేసి...
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన ... 


చరణం 2 :



పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం

అలరులు కురియగ నాడెనదే.. అలకల కులుకుల అలమేల్ మంగ...
అలరులు కురియగ నాడెనదే.. అలకల కులుకుల అలమేల్ మంగ...
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట..
పల్లవించు పద కవితలు పాడి.....

అ... అ.... అ.... అ... అ.... అ.... అ... అ.... అ.... 

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి... 

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5622

ఓం నమఃశివాయా

చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  
ఎస్.పి. శైలజ


పల్లవి :


ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా... ఓం నమఃశివాయా! 




చరణం 1 : 


పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై

ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ


నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ... 
దశోపనిషత్తులై ఇల వెలయా


చరణం 2 :



త్రికాలములు నీ నేత్రత్రయమై

చతుర్వేదములు ప్రాకారములై

త్రికాలములు నీ నేత్రత్రయమై

చతుర్వేదములు ప్రాకారములై

గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై


అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా


ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా



Sunday, June 29, 2014

పదహారేళ్ళకు నీలో నాలో

చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  జానకి 


పల్లవి :


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


వెన్నెలల్లే విరియ బూసి... వెల్లువల్లే ఉరకలేసే


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 1:


పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు..
పాటలు పాడిన చిరు గాలులకు...


తెరచాటొసగిన... చెలులు శిలలకు
తెరచాటొసగిన... చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 2:


నాతో కలిసి నడచిన... కాళ్ళకు
నాలో నిన్నే నింపిన... కళ్ళకు
నిన్నే పిలిచే... నా పెదవులకు
నీకై చిక్కిన... నా నడుమునకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 3:


భ్రమలో లేపిన... తొలి జాములకు
సమయం కుదిరిన... సందె వేళలకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకూ
మనకై వేచే... ముందు నాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు.. ఊ..
కోటి దండాలు.. శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు.. శతకోటి దండాలూ






Monday, August 27, 2012

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

చిత్రం: ఎర్ర గులాబీలు (1979)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

లలలలల లా..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

చరణం 1:

రోజాలతో పూజించనీ.. విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ.. అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ..
కథలే నడిపిందీ..ఈ..ఈ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

చరణం 2:

పయనించనా నీ బాటలో.. మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని.. కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే..
సాగే చేలరేగే..ఏ..ఏ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5757

Thursday, August 16, 2012

గాలికదుపు లేదు

చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: జానకి



పల్లవి:


గాలికదుపు లేదు... కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

గాలికదుపు లేదు... కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా


చరణం 1:

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో


తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా


చరణం 2:


ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ

తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..