Friday, June 27, 2014

చల్లని చిరుగాలీ

చిత్రం :  మా దైవం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:



మూ..మూ..లాల లాల లాల లాలా లాలా లలా
ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ


చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..నిన్నొక సంగతి అడగాలి
ఈ..ఈ..ఈ


ఈ రాజునేకొమ్మ వలచెనో..తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..


చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెపాలీ..

చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెపాలీ..


మనసైన ఒక కొమ్మ వలచింది... నాలో మాటాడే బొమ్మ నిలిచింది....
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..ఈ నీకొక సంగతి తెలపాలీ..ఈ



చరణం 1:


కొమ్మ అనగానే సరిపోతుందా
బొమ్మ అనగానే అయిపోతుందా
పే..రే..లేదా..ఆ..దానికీ ఊరే లేదా..


పరువం..ఉరుకుతుంది..ఆ పచ్చని మేని వంపులలో
బిడియం తొణుకుతుంది..ఆ  అడుగులు సాగనీ నడకలలో
ఎవరనుకున్నావు ఆ బొమ్మా..
రవ్వల అందాల వన రాచగుమ్మా..
చల్లని చిరుగాలీ.. నిన్నొక సంగతి అడగాలి..


చరణం 2:


కబురులతోనే సరిపోయిందా...కవితలల్లితే అయిపోయిందా..
కన్నియ మనసే..ఏ..ఏ..ఏ.. కాస్తా కనుగొన్నావా...


ఉదయం పొంగుతుందీ...
ఆ సుధకి ధరహాస కిరణాలలో..
హృదయం పలుకుతుందీ.. ఆ ముదిత మూగ నయనాలలో..
ఎప్పుడో..ఓ.. ఎప్పుడో..ఓ..
ఈ నేను..ఆ యదనాగలో వొదిగిపోయాను..


చల్లని చిరుగాలీ.. నీకొక సంగతి తెలపాలీ..
ఈ రాజు వలచిన కొమ్మా..ఆ.. నా యదలోని ఈ పైడి బొమ్మా..ఆ
చల్లని చిరుగాలీ...ఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ
ఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ
ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=730

1 comment:

  1. చాల మంచిపాట,లిరిక్స్ పెట్టారు కృతజ్ఞతలు

    ReplyDelete