Sunday, July 20, 2014

తెల్లావారక ముందే పల్లె లేచింది

చిత్రం :  ముత్యాల పల్లకి (1976)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపథ్య గానం :  సుశీల



పల్లవి:



తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది


తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది


చరణం 1:


వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి


తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

 

చరణం 2:


పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు 

పల్లేసీమలో కోకొల్లలు


అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు


తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది


7 comments:

  1. అద్బుతమైన పాట. సాహిత్యం లో చిన్నసవరణలున్నాయి. గమనించగలరు.

    చిత్రం : ముత్యాల పల్లకి (1976)
    సంగీతం : సత్యం
    గీతరచయిత : మల్లెమాల
    నేపధ్య గానం : సుశీల


    పల్లవి:


    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కొంది... అదేపనిగ కూసింది

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    చరణం 1:

    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    చరణం 2:

    పాలవెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లెపూల రాశివంటి మమతలు
    పల్లెసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలు
    ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు

    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    ReplyDelete
    Replies
    1. I used to sing this song. l like this song. Thanks to Mallemalagaru. I met him once on Independence day celebration in a school when I was working there. Really luckey

      to met such a grate person.

      Delete
  2. Thanks Srikanth gaaru! lyrics sarichESAnu.

    ReplyDelete
  3. నాకు పల్లెటూరు పాటలు మరియు వాతావరణం అంటే చాలా ఇష్టం.ఈ పాట చాలా బాగుంది. శ్రీ మల్లెమాల గారు చాలా బాగా వ్రాసేరు. ఈ విదంగా వ్రాయడం చాలా కొద్ది మంది కె సాధ్యం.

    ReplyDelete