చిత్రం : శ్రీవారు మావారు (1973)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను
రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను
రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా
చరణం 1 :
మొదటి చూపులోనే మైమరిచాను.. కనులు కలవగానే కలగన్నాను
మొదటి చూపులోనే మైమరిచాను...కనులు కలవగానే కలగన్నాను
ఎన్ని జన్మల ఈ ప్రేమబంధమో... నే నిన్ను వీడి ఉండలేనులే
రా ప్రియా... నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే
చరణం 2 :
మొదటి చూపులోనే మురిసిన నీవు... చెంత చేరగానే పొమ్మన్నావు
అమ్మగారి మాట నమ్మేదెట్లా... రా రమ్మని పిలువగనే వచ్చెదెట్లా
ముందు ఎన్నడు నీ పొందు కోరను...నా దారి నేను పోతానులే...
రానులే... చాలులే
పోలేవులే.. నీవు పోలేవులే
చరణం 3 :
అందమైనా ఇలాటి వేళా... అందుకోవే గులాబి మాల
కోరికలే మాలికలై నీ మెడలో... వాలెను నేడు
ఎన్ని జన్మల ఈ స్నేహబంధమో.. నే నిన్ను వీడి పోలేనులే
ఓ ప్రియా..... నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను... నా మనసే ఇచ్చాను
రావేలా..ఓ ప్రియా... నా ప్రియా... నా ప్రియా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3570
No comments:
Post a Comment