చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ... ఆ నందన మురళీ
ఇదేనా... ఇదేనా... ఆ మురళి... మోహనమురళీ
ఇదేనా... ఆ మురళీ
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ... ఆ నందన మురళీ
ఇదేనా... ఆ మురళి... మోహనమురళీ
ఇదేనా... ఆ మురళీ
చరణం 1 :
కాళింది మడుగునా కాళీయుని పడగల
ఆబాలగోపాలమాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళీయుని పడగల
ఆబాలగోపాలమాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి... గుండెల మ్రోగిన మురళి
ఇదేనా... ఇదేనా ఆ మురళీ
చరణం 2 :
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
జీవన రాగమై.. బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై... బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా... ఇదేనా ఆ మురళీ
వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురళి... మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ...
చరణం 3 :
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ....... ఆ....... ఆ.....
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ... ఆ నందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి... మోహనమురళీ
ఇదేనా ఆ మురళీ..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7526
This comment has been removed by the author.
ReplyDeleteకృతజ్ఞతలు
ReplyDelete