Tuesday, December 30, 2014

మంచిని సమాధి చేస్తారా

చిత్రం :  నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి :


మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి  
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి  
  



చరణం 1 :


కత్తితో ఛేదించనిదీ కరుణతో ఛేదించాలి..
కక్షతో కానిదీ క్షమాభిక్షతో సాధించాలి
తెలిసీ తెలియక కాలుజారితే..
తెలిసీ తెలియక కాలుజారితే.. చేయూతనిచ్చి నిలపాలి


మనలో కాలుజారనివరూ ఎవరో చెప్పండి..
లోపాలు లేనివారూ ఎవరో చూపండి      


మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి     



చరణం 2 :


గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు


ఆకలి తీరక నేరం చేసే
ఆకలి తీరక నేరం చేసే.. అభాగ్య జీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి     


మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి     


చరణం 3 :



తప్పు చేసిన ఈ దోషినీ ఇప్పుడే శిక్షించాలి
మరుపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి
ఆహా అయితే.. ఎన్నడు పాపం చేయనివాడూ


ఎన్నడు పాపం చేయనివాడూ.. ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి
ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి       


మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి     




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=290

No comments:

Post a Comment