Sunday, October 11, 2015

కత్తిలాంటి పిల్లోయ్

చిత్రం :  మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

కత్తిలాంటి పిల్లోయ్ కదలివచ్చే కాస్కో
మత్తుకళ్ళ మావోయ్ గమ్మత్తు చేస్తా చూస్కో
నీటు చూడు గోటు చూడు ఘాటు ఘాటు పొగరు చూడు ఆట చూడు పాట చూడు
భేటీ కొస్తావా ష్........
ఈ గడుసుతనము పనికిరాదు ఈ మిడిసిపాటు పనికిరాదు

చరణం 1  :

కన్నె పరువము కఠారైనది వన్నె చిన్నెల మిఠాయున్నది
కన్నె పరువము కఠారైనది వన్నె చిన్నెల మిఠాయున్నది 

పడుచు రామచిలుక ఇది పంచదార మొలక
పట్టబోతె చిక్కబోదు పంజరాన వాలదు
కొమ్ములు తిరిగిన మొగాళ్ళు సైతము గుమ్మైపోవాలిలే
కమ్మని తళుకులు వెచ్చని చురకలు కావాల.. ఇస్తానులే..

కత్తిలాంటి పిల్లోయ్ కదలివచ్చే కాస్కో...
మత్తుకళ్ళ మావోయ్ గమ్మత్తు చేస్తా చూస్కో

చరణం 2 :

నిన్ను చూసితి నిఘా వేసితి.. నీలి కన్నుల నిషా పెంచితి
నిన్ను చూసితి నిఘా వేసితి.. నీలి కన్నుల నిషా పెంచితి 

రాలుగాయివైతే  నేనాకతాయినౌతా
వీలు చూసి ఈల వేసి గోలుమాలు చేస్తా
కండలు తిరిగిన గండరగండా నీ గుండె రాబందులా
కైపులు పెరిగిన గుండెలు కరిగిన కథ మారి పోతుందిలే  
 
కత్తిలాంటి పిల్లోయ్ కదలివచ్చే కాస్కో
మత్తుకళ్ళ మావోయ్ గమ్మత్తు చేస్తా చూస్కో
నీటు చూడు గోటు చూడు ఘాటు ఘాటు పొగరు చూడు ఆట చూడు పాట చూడు
భేటీ కొస్తావా ష్........
ఈ గడుసుతనము పనికిరాదు ఈ మిడిసిపాటు పనికిరాదు

No comments:

Post a Comment