Sunday, October 11, 2015

ఏమిటోననుకోంటి గోంగూరకీ

చిత్రం :  ఇంటింటి కథ (1974)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి 





పల్లవి :



ఏమిటోననుకోంటి గోంగూరకీ... నే ఎగురుకుంటు ఎళితినే గోంగూరకీ
ఏమిటోననుకోంటి గోంగూరకీ... నే ఎగురుకుంటు ఎళితినే గోంగూరకీ
సిలిపిదొంగ సచ్చినాడె గోంగూరకీ.. వాడు సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకీ
సెప్పుకుంటె.. సెప్పుకుంటె సిగ్గుచేటు గోంగూరకీ
అబ్బ సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
ఏమిటోననుకోంటి గోంగూరకీ... నే ఎగురుకుంటు ఎళితినే గోంగూరకీ 




చరణం 1 :



సుక్కబొట్టు పెట్టుకొని.. సిగను పూలు పెట్టుకుని
వుంగనూరు గట్టుకాడ..  పుల్లలేరుతుంటేను
సుక్కబొట్టు పెట్టుకొని.. సిగను పూలు పెట్టుకుని
వుంగనూరు గట్టుకాడ.. పుల్లలేరుతుంటేను 

ఒంటిదాన్నిగా సూసి ఎంటతగులుకున్నాడే
చేను చుట్టు తిప్పేడే..  చెయ్యి పైనయేశాడే
చెయ్యి పైనయేశాడే..  ఏశాడే 


అవ్వ.. సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
అబ్బ..  సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
ఏమిటోననుకోంటి గోంగూరకీ.. నే ఎగురుకుంటు ఎళితినే గోంగూరకీ
సిలిపిదొంగ సచ్చినాడె గోంగూరకీ
అబ్బ సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
అవ్వ..  సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ



చరణం 2 :


కడప సంకనెట్టుకొని.. కట్టమీద వత్తుంటె
మఱ్ఱిమానుకాడ వాడు మాటేసి వున్నాడు
కడప సంకనెట్టుకొని.. కట్టమీద వత్తుంటె
మఱ్ఱిమానుకాడ వాడు మాటేసి వున్నాడు
మాయలెన్నొ చేశాడే.. మనసు విరగదీశాడే
మోజు తీర్చమన్నాడే.. ముద్దులివ్వమన్నాడే.. ముద్దులివ్వమన్నాడే



అవ్వ.. సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
అబ్బ.. సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
ఏమిటోననుకోంటి గోంగూరకీ.. నే ఎగురుకుంటు ఎళితినే గోంగూరకీ
సిలిపిదొంగ సచ్చినాడె గోంగూరకీ
అబ్బ సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ
అబ్బ.. సెప్పుకుంటె సిగ్గుసేటు గోంగూరకీ







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3094

No comments:

Post a Comment