Wednesday, October 7, 2015
నీవేరా నా మదిలో
చిత్రం: అంతా మన మంచికే (1972)
నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో దేవా
ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా...
ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశల పూలే దోసిట నింపి వేచే భాగ్యము నాదే..
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ పదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము..
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో
నా జీవితమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నీ సన్నిధియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదే..
ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా
Labels:
(అ),
అంతా మన మంచికే (1972),
దాశరథి,
భానుమతి,
సత్యం
Subscribe to:
Post Comments (Atom)
That background and color. Appearing is so good
ReplyDeleteBhanumati garu has a typical and lovely voice.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఅద్భుతమైన ఆలాపన తోడి మధురరాగం..
ReplyDeleteభానుమతి రామకృష్ణ గారిని ఎప్పటికీ మరువలేము..