Monday, January 11, 2016

అటు గంటల మోతలు.. గణగణా

చిత్రం : బాంధవ్యాలు (1968) 

సంగీతం : సాలూరి హనుమంత రావు 

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : ఘంటసాల, వసంత 



పల్లవి :


అటు గంటల మోతలు.. గణగణా
ఇటు గాజుల సవ్వడి.. గలగల
అటు గంటల మోతలు.. గణగణా
ఇటు గాజుల సవ్వడి.. గలగల
అటు విందునా.. ఇటు కందునా
అటు విందునా.. ఇటు కందునా .
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా.. భళా భళా..
ఎలా ఎలా.. భళా భళా..


అటు గంటల మోతలు.. గణగణా


చరణం 1 :



ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పంచవన్నెల రామచిలకా పలకనైనా పలుకదేమి
కొమ్మ మాటున కోయిలమ్మా కూయనైనా కూయదేమి
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
రాలితే అవి మూటకట్టి కలకాలం దాచుకోనా
కలకాలం దాచుకోనా..


అటు గంటల మోతలు.. గణగణా
ఇటు గాజుల సవ్వడి.. గలగల
అటు విందునా.. ఇటు కందునా..
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
అటు గంటల మోతలు..గణగణా



చరణం 2 :


ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చిలిపి సిగ్గు మేలిముసుగై.. చెలియమోమూ దాచెనెమో
కలికి నవ్వు వెలికి రాక.. పెదవి తెరలో ఒదిగె నేమో



దాచితే అది దాగునా.. చెయ్ చాచితే చెలరేగునా
దాచితే అది దాగునా.. చెయ్ చాచితే చెలరేగునా
నా గుండెలో ఈ బండిలో.. ఈ కుదుపులు ఊరెకె ఉండునా
ఈ కుదుపులు ఊరెకే ఉండునా..



అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు విందునా.. ఇటు కందునా..
అటు విందునా.. ఇటు కందునా
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..హేయ్య్..


ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4879

No comments:

Post a Comment