Thursday, March 3, 2016

ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ

చిత్రం : నిండు మనిషి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


హేయ్... ప్రేమించుకుంద్దాం...  ఎవరేమన్న ఏమన్నగానీ
అహ.. పెనవేసుకుంద్దాం ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా.. హా.. పూలలో తేలుతూ తావిలా



ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ.. పెనవేసుకుంద్దాం ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా.. హా.. పూలలో తేలుతూ తావిలా



చరణం 1 :


నీ కళ్ళల్లో నును సిగ్గు పల్లవి పాడెను...
నీ ఒళ్ళంత మెరుపేదో ఉయ్యాలూగెను
నీ కళ్ళల్లో నును సిగ్గు పల్లవి పాడెను...
నీ ఒళ్ళంత మెరుపేదో ఉయ్యాలూగెను


దుడుకైన నీ చూపు దూసుకుపోయేను
నా ఎదలోన కనరాని సెగలే రేపెను


పొంగనీ ఊహలే వేడిగా... హా
పూయానీ ఆశలే తోడుగా... హా



హేయ్... ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ.. పెనవేసుకుంద్దాం ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా.. హా.. పూలలో తేలుతూ తావిలా



చరణం 2 :


పరువాల జడివాన పడుతూ వున్నది...
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది
పరువాల జడివాన పడుతూ వున్నది...
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది


మొదలైన ఈ హాయి తుదివరకుండాలి
అది ప్రతి రేయి మనసైన రుచులే చూపాలి


చిందనీ ప్రేమలే జల్లుగా... హా
పండనీ జీవితం చల్లగా... హా.. ఆ.. ఆ


హేయ్... ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ.. పెనవేసుకుంద్దాం ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా.. హా.. పూలలో తేలుతూ తావిలా
ఆహాహా ఆహహా ఆహాహా ఆ.. లాలలా లాలలా లాలలా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2511

1 comment: