Friday, April 29, 2016

తద్ధిమి తకఝణు

చిత్రం :  బందిపోటు విప్లవ సింహం (1982)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  జానకి





పల్లవి :


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా 


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహోహో.. ఓహోహో.. ఆహాహా.. ఆహాహా..
సుక్కలన్ని సోకులు మీరే...  సందమామ పక్కకు సేరె
సుక్కలన్ని సోకులు మీరే...  సందమామ పక్కకు సేరె
చక్కనైన వేళా... ఆ... ఆ


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 


చరణం 1 :


సిటికంత లేత నడుము ఊగిపోతుంటే

సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే

సిటికంత లేత నడుము ఊగిపోతుంటే

సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే



చల్లగాలి శ్రుతిగా...  చక్కని పిల్లదాని జతగా

చల్లగాలి శ్రుతిగా...  చక్కని పిల్లదాని జతగా

అల్లన మెల్లన గుండెలు ఝల్లన ఆడవోయి మావ


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా


ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 




చరణం 2  :



ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది
ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది


కన్నెపిల్ల ఇదిగో...  వెన్నెల గోరుముద్దలవిగో
కన్నెపిల్ల ఇదిగో...  వెన్నెల గోరుముద్దలవిగో
చల్లగ మెల్లగ సరసాలాడుతూ ఆరగించు మావా




ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా


ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9906

సాచి కొడితే





చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   బాలు


పల్లవి :


సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం


ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం





సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం


ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం




చరణం 1 :



అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా
అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా


చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
రేగింది మదిలోన మ్రోగింది తుంబ... మోతగా తుంబా..


సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం


ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం




చరణం 2 :



అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం
అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం



శృతి మించే రాగం.. జతలో సరాగం
శృతి మించే రాగం.. జతలో సరాగం
ఇది ముద్దు మురిపాల కళ్యాణి రాగం..
దదద నినిని రిరిరి మమమ పప.. మపప గమమ రిగగ సరిరి నిసగరిస
ఇదే ఆది తాళం.. ఇదే ఆదితాళం.. 






సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం


ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9060

Thursday, April 28, 2016

ఒకటే తనువంతా






చిత్రం : బాల గోపాలుడు (1989)
సంగీతం : రాజ్ - కోటి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర 







పల్లవి :




ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 


సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే 


ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత



చరణం 1 :



నీ చూపు పడ్డనాడే చుక్కలాడే
నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే
నీ గాలి సోకగానే సోకులాడె
నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే 


ఈ తాకిడి ఒక తారంగము
ముద్దాడితే తొలి తాంబూలము
హత్తుకుంటే హాయి పుట్టసాగే
గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే 


శృంగార వీధుల్లో ఊరేగుతుంటే 
అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే 

ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే..హో..  వన్నె చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే 



ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 



చరణం 2 :



నీ కాటు పడ్డ బుగ్గ కందిపోయె
నీ చాటు అందమంతా చిందిపోయె
నీరెండ పడ్డ నీడ నిన్ను కోరె
నీ వెన్నపూస మీద గవ్వలాడె 


ఈ చీమలే చలి నారింజలై
పండించినా తొలి గోరింటలై
మత్తుగాలి వీచే మాపటేలా
కొత్త ఊపుకొచ్చే రాసలీల 


సయ్యాట తోటల్లో సంపెంగ పూసె.. నీ కంటి పాపల్లో జాబిల్లి కాసె
కళ్యాణాలే కల్లోకొస్తుంటే.. ఓ.. కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే 



ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 


సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె 


వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే 


ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత










http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10325

మావయ్య అన్న పిలుపు






చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, శైలజ






పల్లవి :



మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



కమ్మగా పాడనా కంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



చరణం 1 :



అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా


అమ్మగా లాలించాడు
నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు


తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు



మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు




చరణం 2 :



ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్నీ పండగా

తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా
నీ పాపకు జోల పాడనా


ఇది అరుదైన ఓ అన్న కథ
ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి




మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



కమ్మగా పాడనా కంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు






Tuesday, April 26, 2016

తూలే తూలే తూలేనమ్మ







చిత్రం : జననీ జన్మభూమి (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆ..
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..




చరణం 1 :



నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న
నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న


నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ
నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ


వారణాసి నదులు నీ కాళ్ళు కడగంగ
నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా...   గౌరీమోహనా


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 





చరణం 2 :



పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి
పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి


అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా
అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా


కాశీ విశాలాక్షి కండ్లే కలువాలవ్వంగా 



నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా... గౌరీమోహనా


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 


ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ..ఆ ఆ. ఆ.ఆ..ఆ.. ఆ..ఆ









http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10262

ముత్యాల చెమ్మచెక్కలు






చిత్రం  :  మువ్వ గోపాలుడు (1987)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  బాలు, సుశీల 




పల్లవి :



ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా 


చేమంతికి సీమంతం... గోరింకకు పేరంటం
సిరిమల్లికి సింధూరం


లలలలలలలల...

ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా  




చరణం 1 :


చిగురు మాను గుబురుళ్లూ.. చిలకపాప కబురుళ్లు
పైరుపైరునా పైర గాలి పరవళ్లు



చిగురు మాను గుబురుళ్లూ..
చిలక పాప కబురుళ్లూ
పైరుపైరునా పైర గాలి పరవళ్లు


కోకిల గొంతున కుహుకుహు రాగం
మబ్బుల మాటున ధిమిధిమి నాదం
కోకిల గొంతున కుహుకుహు రాగం
మబ్బుల మాటున ధిమిధిమి నాదం


ఆకాశం అంచు మీద ఆరేసిన మబ్బు చీర
అందుకుంటే ఆటవిడుపు... పదవే...
పదపదపదపద.. పదపదపదపద..


అహ..ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా
కొండపల్లి కొయ్యబొమ్మ.. కోకకట్టి కూర్చుందమ్మ
అంతలోనే అయ్యయ్యయ్యో... పమపమపమపమ



ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా 




చరణం 2 :




సరి ఈడు అమ్మళ్లు.. సరదాల గుమ్మళ్లు
ఆటలాడితే.. అల్లోఅల్లో నేరళ్ళు



సరి ఈడు అమ్మళ్లు..
సరదాల గుమ్మళ్లు
ఆటలాడితే అల్లోఅల్ళో నేరళ్ళు


కురిసే సిగ్గుల మరదలు పిల్లా
మెరిసే బుగ్గల సొగసరి పిల్లా
కురిసే సిగ్గుల మరదలు పిల్లా
మెరిసే బుగ్గల సొగసరి పిల్లా



నిన్నేమో చిన్ని మొలక.. నేడేమో వన్నె చిలకా
నేటితోనే ఆట కట్టు... అవునా...
సరిసరిసరిసరిసరిసరిసరిసరి...



ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా
కొండపల్లి కొయ్యబొమ్మ.. కోకకట్టి కూర్చుందమ్మ
అంతలోనే అయ్యయ్యయ్యో...
లలలలలలలలలల..



అరే.. ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా  
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10278

Monday, April 25, 2016

ఏమని పాడను





చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల 



పల్లవి :



ఏమని పాడను..
ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను...
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం



అది చెబుతున్నప్పుడు... లయ పుడుతున్నప్పుడు...
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు


ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం



అది చెబుతున్నప్పుడు... లయ పుడుతున్నప్పుడు...
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు





చరణం 1 :



వయసొచ్చిన మర్నాడే... మనసిస్తుంది
మనసిచ్చీ ఇవ్వగానే కథమౌదలౌతుంది
వయసొచ్చిన మర్నాడే... మనసిస్తుంది
మనసిచ్చీ ఇవ్వగానే కథమౌదలౌతుంది 


నిదరన్నది కంటికి రాకా.. కుదురన్నది వంటికి లేకా
నిదరన్నది కంటికి రాకా.. కుదురన్నది వంటికి లేకా


ఆకలిగా.. దాహంగా... కౌగిలిగా.. మోహంగా
బ్రతుకు పంతమై.. బతిమాలుకునే నమస్కార బాణమ్
అదే.. మొదటి చుంబనమ్ 



ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం




అది చెబుతున్నప్పుడు... లయ పుడుతున్నప్పుడు...
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు




చరణం 2 :



తొలి చూపే వలపులకు శ్రీకారం
కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం
తొలి చూపే వలపులకు శ్రీకారం
కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం


నడిరాతిరి ముగ్గులు పెట్టి...తెలవారని పొద్దులు దాటి
నడిరాతిరి ముగ్గులు పెట్టి...తెలవారని పొద్దులు దాటి


ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా
పులకరింతగా పలకరించినా మల్లెపూల బాణమ్
అదే....  వలపు వందనం



ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం




అది చెబుతున్నప్పుడు... లయ పుడుతున్నప్పుడు...
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు




ఏమని పాడను... ఏదని చెప్పను
ఊమ్మ్..ఊమ్మ్మ్








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10333

ఎంత నేర్చినా





చిత్రం : సీతారామకళ్యాణం (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :





ఎంత నేర్చినా...  ఎంత నేర్చినా
ఎంత చూచినా... ఎంత చూచినా
ఎంత వారలైన... ఎంత వారలైన
కాంత దాసులే... ప్రేమ దాసులే

ఆ.. ఆ.. ఆ.. కాదమ్మా..
ప్రేమదాసులే కాదు.. కాంతదాసులే
కాదు సార్.. ప్రేమ దాసులే
తప్పమ్మా.. తప్పదు సార్


అంతేనంటావా.. 


ఎంత నేర్చినా ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే... ఎంత నేర్చినా


సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ
చింత లేని వా...రెంత నేర్చినా 


సంతతంబు ఏకాంత సెవకై
ఇంత తంతు చేసి చెంత చేరు వా..రెంత నేర్చినా 


ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే

ఎంత నేర్చినా.... 




చరణం 1 :



లయ లేనిదే స్వరముండునా.. స్వరరాగములు లేక పాటుండునా
నువు లేనిదే నేనుండునా.. నా మనసు నిను వీడి బ్రతికుండునా



రాముడు విలు వంచి... సీతను పెండ్లాడె కదా
పార్వతి తపియించి పరమేశుని పొందెగదా
ఆ పాటి మనమైనా తెగియించమా



ఎంత నేర్చినా...  ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే
ఆ.. ఆ.. ఎంత నేర్పినా...  




చరణం 2 :



ముద్దున్నది.. పొద్దున్ననది
అధరాలు అదిరదిరి పడుతున్నవి


తలపున్ననది.. తలుపున్నది
గడివేస్తే ఇరుకైన గది ఉన్నది


ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా
పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా
కలిపారు సరదాల చెరసాలలో



ఎంత నేర్చినా...  ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే
ఎంత నేర్చినా... 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10270

Sunday, April 24, 2016

వంగతోట కాడ ఒళ్ళు జాగర్త




చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :





నోమీ నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ
నోమీ నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ 



పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ 


బారెడంత పొద్దుంది నేరాను పోరా
బూటకాల బుల్లోడా...  బూటకాల బుల్లోడా 

బారెడంత పొద్దుంది నేరాను పోరా
బూటకాల బుల్లోడా...  బూటకాల బుల్లోడా 

నోమీ నోమన్నల్లాల నోమన్నలాల సందామామ



సందామామ... సందామామ.. సందామామ..సందామామ



వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
వంగతోట కాడ ఒళ్ళు జాగర్త 



నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే నా తరమా... నీ తరమా



కందతోట కాడ కాళ్ళు జాగర్త
కందతోట కాడ కాళ్ళు జాగర్త 


చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
ఆ దురద ఆపాలంటే నీ తరమా... నా తరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త




చరణం 1 :


దోరమిరపకాయ లాగా ధుమధుమలాడుతున్నావు  దోరమిరపకాయ లాగా ధుమధుమలాడుతున్నావు కారం తగ్గించుకో...  వెటకారం ఒగ్గేసుకో


కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు మురిపెం ముడేసుకో...  నీ పరువం దాచేసుకో


చెరుకులాంటి కరుకుదనం చాలు చాలు చాలు కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు 

కందతోటకాడ కాళ్ళు జాగర్త
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త





చరణం 2 :



ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు
ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు
చప్పున దాటేసుకో... ననుగుట్టుగా వాటేసుకో హాయ్ 


రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు
రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు
కళ్ళెం వేసేసుకో నీ అల్లరి ఆపేసుకో


పొగరున్న వంశంలే నాది నాది నాది
ఆ వంశం నీదేనా నాది నాది నాది



వంగతోటకాడ ఒళ్ళు జాగర్త
కందతోటకాడ కాళ్ళు జాగర్త


నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే నా తరమా... నీ తరమా



కందతోటకాడ కాళ్ళు జాగర్త
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త... హా.. హా.. హా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10313

నీవే కదా నా స్వీటు ఫిగరు




చిత్రం : నేటి సిధ్ధార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, కవితా కృష్ణమూర్తి 





పల్లవి :




నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు



మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు



సుందరం సుమధురం సుమశరం
ఇద్దరం కలవటం అవసరం



నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు



మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు 




చరణం 1 :



సుఖాలలో సుగంధం... మజాలలో మరందం
వయస్సు ఓ వసంతం.. చెలో చెలి దిగంతం



పదాలలో సరాగం.. పెదాలలో పరాగం
తడిపొడి తరంగం.. ఎద ఎద ప్రసంగం


డోరేమీలా జాజిలీ... సారిగామా జావళి
బాంబే హైవే లావలీ.. నీతో కలిసి పాడనీ



మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు 




నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు




చరణం 2 :



కథాకళి కదంలో  మణిపురి కళల్లో
వయ్యారమే వరిస్తే మయూరిలా నటిస్తా


నిటారుగా నిలుస్తా... గిటారుతో కలుస్తా
శృతిలయా కలిస్తే.. సితారల్లే గెలుస్తా


నిజామరాలి బదలికా... ఇంటర్ ఖయాం లిమరికా
నీకు నాకు కలయికా.. హిందుస్తానీ అమెరికా



నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు



మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు 



సుందరం సుమధురం సుమశరం
ఇద్దరం కలవటం అవసరం











http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10766

కమ్మని ఒడి బొమ్మని




చిత్రం :  అల్లరి అల్లుడు (1993)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


ఆ ఆ ఆ..ఆ ...ఆ....ఆ....
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
ఆహహ్హ హాయ్ హాయ్
ఒహొహ్హొ ఓ ..ఓ



చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
ఒహోహూో హాయ్ హాయ్
ఆహహ్హా హై హై



గొడుగులో రాగం...  అడుగులో తాళం
నిషాలల వేసే  బాణమ్
రసాలలో త్రుణమ్ పణమ్


కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే





చరణం 1 :


మీడిసి పడకే తొలి సొగసు మొగలి పువ్వు రేకా
కసా బుస కసా కసిగా


పడగ విడిచి విరి పడక పరుచుకున్నాగా..
పగ వగా ఇదే పదరా


చినుకు పడి చీర జారే... మెరుపు మెడ హార మేసే
ఉరుము జతిలో నడుము లయలో.. చలో లేలో


తడిసే నీ రూపం...  తళుకులో దీపం
వయస్సులో వానే వస్తే... తడి స్వరం చలి జ్వరం



కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే





చరణం 2 :



గుబులు గుబులు మొదలగులు పెరిగే వొళ్ళంతా
సడే మియా తడి పొడిగా


చిగురు పొగరు చెలి ఫిగర్ కెదిగి తుల్ళింతా
పదే పదే అదే పనిగా


జడ తడిసి జావళీలై మెదలదగ తాళ మేసే
ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో


అడిగితే అందం...  అధరమే బంధం
అయోమయం ఆషాడంలో ప్రియా ప్రియం
స్వయంవరం





కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
ఆహహ్హ హాయ్ హాయ్
ఒహొహ్హొ ఓ ..ఓ



చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
ఒహోహూో హాయ్ హాయ్
ఆహహ్హా హై హై



గొడుగులో రాగం...  అడుగులో తాళం
నిషాలల వేసే  బాణమ్
రసాలలో త్రుణమ్ పణమ్





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10785

గిరిలో లాహిరి






చిత్రం : నేటి సిధ్ధార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :




గిరిలో లాహిరి...  గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి


జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి

గిరిలో లాహిరి...  గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి


జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి




చరణం 1 :



పడుచుల పాటలే పనసల తెనెలై..
నడుమున ఊగినా గమకపు వీణలై


మగసిరి నవ్వులే గుడిసెపు దివ్వెలై
చిచ్చరి చిందుకీ సిరిసిరి చిందులై


ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
కడకొంగులు దాటిన ఈ కన్నె సొగసులు
చాలిస్తే మేలు కదా సంధే వరసలు



గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి


జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి




చరణం 2 :



కలిసిన కన్నులే కౌగిట వెన్నెలై..
వగలను పొంగినా పరువపు జున్నులై


మరువపు మల్లెలే మాపటి ఆశలై..
వదిలిన మత్తులో అలిగిన ఊసులై


మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా కంటికి రెప్పలు ఈ మంచి మనసులు
మీరేగా వాల్మీకి శబరి గురుతులు



హేయ్.. గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి


జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి


గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10768

Saturday, April 23, 2016

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా





చిత్రం :  విక్కీ దాదా (1989)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత :
నేపధ్య గానం :  బాలు, జానకి 



పల్లవి :


ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా
మొగ్గేసేలే అందానికే.. సిగ్గేసెలే పగ్గానికే
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా



ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
నీతోనే నే కాలు జారి పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో 



ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా




చరణం 1 :


నాకేమో పిచ్చాకలి... తీరేదే ఎట్టామరి
ఒల్లంతా ఒకటే చలి... తీరేనా ఈ రాతిరి


మెరుపు విరుపు రెండింతలై...
ఉడుకు దుడుకు రెట్టింపులై...


అది వేసిందమ్మ నీ తోడు
వల వేసిందయ్యో నా ఈడు...

పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా



ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా




చరణం 2 :




పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము
అంతేలే పోరాటము.. ఆడేలే కోలాటము


కలిసి కలిసి కవ్వింతగా...
వయసుసొగసు తుళ్ళింతగా 


దులిపేసిందయ్యో నీ జోరు..
తొలి రోజుల్లోనే బేజారు...
నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా


ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా


ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా 



ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10757

ఫాలనేత్రానల







చిత్రం :  అన్నమయ్య (1997)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  అన్నమయ్య
నేపధ్య గానం :  





పల్లవి :


ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ... లక్ష్మీనారసింహా




చరణం 1 :



ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార
లలితనిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన
చలన విధినిపుణ నిశ్చల నారసింహా... నిశ్చల నారసింహా




చరణం 2 :



దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి
కారస్ఫులింగసంగక్రీడయా
వైరిదానవఘోర వంశభస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహ... వేంకట నారసింహ
వేంకట నారసింహ... వేంకట నారసింహ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10527

బ్రహ్మ కడిగిన పాదము

చిత్రం :  అన్నమయ్య (1997)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  అన్నమయ్య
నేపధ్య గానం :  




పల్లవి :


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము




బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము



బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము



బ్రహ్మ కడిగిన పాదము




చరణం 1 :



చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము




బ్రహ్మ కడిగిన పాదము



చరణం 2 :



కామిని పాపము కడిగిన పాదము... పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము... పామిడి తురగపు పాదము



బ్రహ్మ కడిగిన పాదము



చరణం 3 :



పరమ యోగులకు పరి పరి విధముల... పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన... పరమ పదము నీ పాదము




బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము



బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10521

అంతర్యామి అలసితి




చిత్రం :  అన్నమయ్య (1997)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  అన్నమయ్య
నేపధ్య గానం :  బాలు




పల్లవి :



అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి... సొలసితి





చరణం 1 :




కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక


భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరుపున బోవు నీవు వద్దనక


అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని.... అంతర్యామి




చరణం 2 :


మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక


ఎదుటనే శ్రీవేంకటేశ్వర
వేంకటేశా... శ్రీనివాస.. ప్రభో
ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదె
అదనగాచితివి అట్టిట్టనక



అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని


అంతర్యామి...  అంతర్యామి
అంతర్యామి...  అంతర్యామి
అంతర్యామి...  అంతర్యామి
అంతర్యామి...  అలసితి








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10520

కొండలలో నెలకొన్న

చిత్రం :  అన్నమయ్య (1997)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  అన్నమయ్య
నేపధ్య గానం :  బాలు





పల్లవి :



కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు



చరణం 1 :



కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు


దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు




కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు




చరణం 2 :


కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు



ఎంచి యెక్కుడైన వేంకటేశుడు...
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు



కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8360

అదివో అల్లదివో





చిత్రం :  అన్నమయ్య (1997)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  అన్నమయ్య
నేపధ్య గానం :  బాలు



పల్లవి :

అదివో... 


అదివో అల్లదివో శ్రీహరివాసము

అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము


అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము



చరణం 1 :


అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు


వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ 


నదె చూడుఁడదె మొక్కుఁడానందమయము
నదె చూడుఁడదె మొక్కుఁడానందమయము



అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము




చరణం 2 :




కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూపమదివో


వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ 


భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్లఁ పావనమయము...



అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8359

Friday, April 22, 2016

సిలకలాగా కులుకుతుంటే

చిత్రం : వారసుడు (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర  






పల్లవి  :



ఒ..ఒ..ఒ.. ఓరియా
ఒ..ఒ..ఒ.. ఓరియా


సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే


ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా



సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే





చరణం 1 :



పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా
బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా
మాయమాటలింక చాలు పోకిరి... ఇటు రా మరి
కాక మీద ఉంది పిల్ల డింగరి... చూసై గురి


కరగదీయనా... అరగదీయనా...
చిక్కావులే ఎడాపెడా చిన్నారి




ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా



సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని.....  మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే




చరణం 2 : 



ఉంగా ఉంగా ఓరి నాయనో.. ఓపలేనురోయ్ వన్నెకాడా
వయ్యారంగా అస్కుబుస్కులు మొదలు పెట్టనా మంచెకాడా


తీపి తిక్క రేగుతోంది పిల్లడా... నీ జిమ్మడ
సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే... పద గుమ్మడి
దొరికినానని కొరకమాకురో.. సందిట్లో చెడమడా బావయ్యో


ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా



సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్..
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని..ఓయ్..
కుదురుగుంటే..ఓయ్..
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే


ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10782

danger యమ danger

చిత్రం : వారసుడు (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర  




పల్లవి  :


వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger


విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger



మెత్త మెత్తగా తలకెక్కుతుంతది
మత్తు మత్తుగా అహ ముంచుతుంతది
నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాలమేసి గోలుమాలు చేస్తుంది ..
danger యమ danger



వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger




చరణం 1 :



 ఒక్క లుక్కే చాలు
ఒక్క లుక్కే చాలు..
చమక్ చం చం... చుక్కలన్నీ నక్కే చోటికి నే దూసుకుపోతా


ఒక్కటిస్తే చాలు
ఒక్కటిస్తే చాలు...
జమక్ జం జం... సిగ్గుపడ్డ సొగసంతా నీకే సొంతం చేస్తా


వయ్యారమహో వల వేసే
ఇది కనికట్టు...  అది కనిపెట్టు


కవ్వింపులతో కలబోసి
ఇది తొలిమెట్టు...  ఇక తలపెట్టు


కన్ను గీటితే...  వెన్ను మీటనా
చిరునవ్వులు రువ్వుకు పొమ్మని కన్నె సోకు కరగదీసి పోతుంది



danger...  యమ danger
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger


విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
danger...  యమ danger



చరణం 2 : 


బుగ్గ కాటే బాయ్యో...
బుగ్గ కాటే బాయ్యో...
ధనక్ దన దన... కొత్త కోక నలిగే కౌగిలిలో బానిసనవుతా


సిగ్గు దాటేయ్ పిల్లో...
సిగ్గు దాటేయ్ పిల్లో....
సమక్ సం సం... కుర్ర వేడి ముదిరే నీ ఒడిలో జాతర చేస్తా


తయ్యారు రా హో తెర తీశా
ఇది మలిమెట్టు ఇక జతకట్టు


అయ్యారే సుఖం శృతి చేశా
ఇది ఎవెరెస్ట్ ... ఇక నో రెస్ట్
చోటు దొరికితే... చాటు చేరనా
ఎరుపెక్కిన ఒంపులు సొంపులు లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే



danger...  యమ danger


యమ యమ యమ యమ danger




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10781

కొత్తగుంది ప్రేమ


చిత్రం : వారసుడు (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి  :


ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...


ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున



ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...



చరణం 1 :




చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి


నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి


సిగ్గు లూటీ... చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీ... కౌగిళ్లు దాటి
ఒకటే సరదా...  వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన 



ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...




చరణం 2 : 



ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా


పొద్దుపోదు...  ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు...  నా వల్ల కాదు
ఒకటే గొడవ...  ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన




ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...


ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున



ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10783

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట






చిత్రం : రక్షణ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి  :



గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా


గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా


అమ్మో అంతటా వింతటా... ఒక్కటే చిచ్చటా
పాపం.. లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట


గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా 



చరణం 1 :




చెలి తాకిన సుఖానికీ ఇలా రేగి పోవాలా
కొయ్యబారిన క్షణనికే కులాశాలు కావాలా


నిలువునా... పిలవనా
వదలదీ ఖర్మం తలబడే కథా
కసరకే పాపం పసితనం కదా


ఐతే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట


గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా


అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా
పాపం లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట


గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా





చరణం 2 : 




ఆడగాలికి అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నెతీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం


నర నరం... కలవరం...
కనకనే కంట్లో...  కునుకు ఉండదే
కౌగిలే ఉంటే కలత ఉండదే


ఇంకేం తథాస్తు అనుకొని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి



గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా









http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10776

కన్నెపాపా అందుకో






చిత్రం : రక్షణ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర




పల్లవి  :



Hands up
You are under arrest
Don't move
I want to dance with you


కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో


ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో


కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో


ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో




చరణం 1 :




నా కదం రిధం జతే పడే దూకుల్లో
ఓ...మేడం సలాం వశం అనే కుర్రాల్లూ


సిగ్గులు విడిచీ పెట్టుకు వస్తే లగ్గం
సాధనలోనే చూపెడతాలే ఓ స్వర్గం


దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్




కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో


ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో






చరణం 2 : 




చూపకూ నిగ్గూ నీ దమ్ములోన వేడీ
ఆపకూ అలా కులాశ కూచిపూడీ


లాఫరు ఫోజుల కథకెళి చెయ్యకు బద్రం
చూపుల భరతం పట్టేస్తుందీ చ్హూ మంత్రం
ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాపము చేస్తా ఆవిరి ముక్కుల ఆరంగేట్రం



కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో


ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో








ఏ జన్మదో ఈ సంబంధమూ





చిత్రం : రక్షణ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : కీరవాణి, చిత్ర 





పల్లవి  :



ఆహహా లాలలా
లల లల లల లల లలలా
ఆహహా లాలలా
లల లల లల లల లా హా


ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం...  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ



చరణం 1 :




ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం


పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ




చరణం 2 :




లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ


వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో



ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం...  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10777

Thursday, April 21, 2016

హలో గురూ ప్రేమ కోసమేరోయ్






చిత్రం : నిర్ణయం (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు




పల్లవి  :



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి


హార్నీ...  హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం




చరణం 1 :



ఉంగరాల జుట్టు వాణ్ణి ... ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి
చదువుసంధ్య గల్గినోణ్ణి ... చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి .. అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా


నాకన్న నీకున్న తాఖీదు లేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా


I Love You Darling... Because You Are Charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
Why Not...



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి
Yeah Yeah



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం



చరణం 2 :



కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టుపెట్టుకుంటినమ్మో బెట్టుచేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లెతీగలా


నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లూ
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ


ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా


अच्चा मैने प्यार् किया ... लुच्चा काम् नही किया
అమీతుమీ తేలకుంటే నిను లేవదీస్కుపోతా
Are You Ready?


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి


అహహా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10509

ఓ.. ప్రియా ప్రియా







చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, చిత్ర 




పల్లవి : 



ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం...  నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ


ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు...  మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే...  రేపు లేదులే
వీడుకోలిదే...  వీడుకోలిదే 




చరణం 1 :




నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము


గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు గెలిచేది ప్రేమతో


ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమ



ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా





చరణం 2 :



కాళిదాసు గీతికీ కృష్ణరాస లీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అనారు  ఆశకి.. తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి.. చావు పల్లకి
నిధి కన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని


వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమ


ఓ.. ప్రియా ప్రియా... నా  ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా


కాలమన్న ప్రేయసి తీర్చమంది లేకసి
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం....  ప్రేమదే జయం 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10759

స్వాతి చినుకు సందెవేళలో






చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి





పల్లవి :



స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా... హా
భలే కదా గాలి ఇచ్చటా...



స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..హోయ్..
ఇదే కదా చిలిపి ఆపదా 




చరణం 1 :




ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి


నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన


స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్


మబ్బే కన్ను గీటే మతే పైట దాటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా... హొయ్


ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చటా ...హా
భలే కదా గాలి ఇచ్చటా 




చరణం 2 :




యా యా యా యా యా యా....
ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన



స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్


ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే


భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10752

అబ్బ దీని సోకు






చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర





పల్లవి :


అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు


అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు


లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే


అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు


అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 





చరణం 1 :



దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా


సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మచీకట్లు సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా


ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే
ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి
చాటు చూసి దాటుతుంటే తంటా


అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు


అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు


లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే


అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 





చరణం 2 :



ఎన్ని బాణాలు వేస్తావు నీవు...  తీపిగాయలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో...  కంటికే నోరు మూసెయ్యనా


ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా


తెడ్డులేని నావా చలాకి ప్రేమా...  సందు చూసి పాడే సరాగమే
బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే
ముందుగానె దోపిడైతె .... టాటా



అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు


అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు


లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే


అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు


అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10753