చిత్రం : కన్నెమనసులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
హ్మ్మ్..హ్మ్మ్మ్ ...హ్మ్మ్..
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
చరణం 1 :
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది
ఎగిరిపోయిన పైట ఏమి సెప్పిందో... పైటలా మా బావ పెనవేసుకున్నాడు
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
చరణం 2 :
దూరాన ఓ మబ్బు తొంగి చూసింది...
సల్లగా ఓ సిన్న జల్లు కురిసింది
జల్లులో మా బావ కళ్ళు కలిపాడు...
సిగ్గు ముంచేసింది... బుగ్గ తుంచేశాడు
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
చరణం 3 :
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది
సెంత చేరి సైగ చేసి సేతులు జాపాడు
నా వలపులోని వేడి తాను పంచుకున్నాడు
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7131
No comments:
Post a Comment