Friday, October 21, 2016

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం






చిత్రం : కురుక్షేత్రం (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం :  బాలు




పల్లవి :


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం
రథగజహయపదాతిదళసరభసగమనం.. ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
రథగజహయపదాతిదళసరభసగమనం.. ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం




చరణం 1 :


కపిధ్వజాంచిత సితాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు
కపిధ్వజాంచిత సితాశ్వరంజిత  రథస్థితులు కృష్ణార్జునులు
విజయుడు రథీ..  గోవిందుడు సారథీ
విజయుడు రథీ..  గోవిందుడు సారథీ
ఉభయులు నరనారాయణులు....  ఉభయులు నరనారాయణులూ


గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళపతాక  విరాజితుడు
రంగత్తుంగ మదేభనిభాంగుడు ...రారాజు ధుర్యోధనుడు 


మానవ జీవితమే ఒక మహాభారతం
ఆ..ఆ.... మానవ జీవితమే ఒక మహాభారతం
అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం
నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే.. ఆ...
ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే... ధర్మయుద్ధమే... ధర్మయుద్ధమే



ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం
రథగజహయపదాతిదళసరభసగమనం ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం




చరణం 2 :



స్థితప్రజ్ఞుడతి నిర్మలచరితుడు ధర్మాయుధుడు...  యుధిష్ఠిరుడు

రవితేజస్సముదీర్ణుడు కర్ణుడు మైత్రీబంధ వినిష్ఠితుడు
రిపుమర్ధన దోర్దాముడు భీముడు శపథనిబద్ధ గాధాయుధుడు
ధనురాగమ నిష్ణాతుడు ద్రోణుడు కదనవ్యూహ విశారదుడు



బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు
మోహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు
మోహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు


అనివార్యం యుద్ధం.. అనివార్యం యుద్ధం
శరసంధానమే ధర్మం...  శరసంధానమే ధర్మం
ఆధర్మ పరిక్షాంగణమే కురుక్షేత్రం... కురుక్షేత్రం... కురుక్షేత్రం



చరణం 3 :



ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు భయదాస్త్రమ్ముల పాండవ సేనల చండాడే
ధర్మజుడు అసత్యమాడకున్న గురుడస్తమించడని హరిపలికే
అదే సమయమున భీముడు చంపెను అశ్వత్థామాహ్వయ కరినీ..
' అశ్వత్థామః హతః  కుంజరః ' అనెను విధిలేక ధర్మాత్మజుడు


తనయుడే  మరణించెనను శోకభారాన గురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే
ధృష్టద్యుమ్నుని మనోభీష్టంబు నెరవేర గురునిపై లంఘించి శిరము ఖండించే
ద్రోణాంతమును గాంచి కౌంతేయప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే
కురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము కూలెననికురురాజు కుమిలి దురపిల్లె
ద్రోణ దుర్మరణానికశ్వత్థామ రెండవరుద్రుడై
అగ్నిముఖ నారాయణాస్త్రము నంపె పాండవసేనపై 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3150

No comments:

Post a Comment