Wednesday, October 19, 2016

ఆరు మాసాలాగు
చిత్రం :  పసి హృదయాలు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఆరు మాసాలాగు..  పుడతాడు మనకో బాబు
ఆరు మాసాలాగు..  పుడతాడు మనకో బాబు
కనువిందుగా...  ఇక పండుగ


ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
మగవారే.. మహా తొందరా 


ఓ...ఓ....ఓ...  ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబుచరణం 1 :


అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా
అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటానేడు దొరగారూ వెంటపడతారూ
నేడు దొరగారూ వెంటపడతారూ
రేపు మీ బాబే  లోకమంటారూ
పాపాయికే గిలిగింతలూ.. లాలింపులుఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబుచరణం 2 :


నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ


నిండినవి నెలలూ... పండునిక  కలలూ
నిండినవి నెలలూ... పండునిక  కలలూ
నేటి తొలి చూలు... రేపు మురిపాలు
నా ఆశలూ.. నా బాసలూ... తీరేనులే


ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
కనువిందుగా...  ఇక పండుగ
ఆగనని అన్నానా..  ఆగడం చేశానా
మహరాణికే.. ఈ తొందరా

ఓ...ఓ....ఓ...  ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3575

No comments:

Post a Comment