Wednesday, October 19, 2016

అల్లరి చూపులవాడే








చిత్రం :  శ్రీవారు మావారు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  జానకి



పల్లవి :



హొయ్.. అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
హూయ్..హూయ్..   అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని.. వాడు రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే




అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే..ఏడే ఏడే



చరణం 1 :


అందాలన్నీ దోసిట దూసేనన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే
అందాలన్నీ దోసిట దూసేనన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే
కలగా నన్నే కవ్వించాడే.. అలలా నాలో పులకించాడే
అమ్మో..ఏ మందునే.. సందిటనే చేరగనే సగమైనానే  



ఓ..అల్లరి చూపులవాడే...  అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే.. ఏడే ఏడే



చరణం 2 :


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ లలలలలా
మ్మ్ మ్మ్ మ్మ్ హా..మ్మ్ మ్మ్ మ్మ్ హా..లలలలలాలలా..హోయ్
చెయీ చెయీ కలపాలని.. అన్నాడే
రేయీ రేయీ కలవాలని.. అన్నాడే
చెయీ చెయీ కలపాలని.. అన్నాడే
రేయీ రేయీ కలవాలని.. అన్నాడే


ఎదలో వాడే.. ఎదుగుతున్నాడే
నిదురే కరువై.. వేగుతున్నానే
అమ్మో.. ఏ మందునే...  ఓ యమ్మో యీ తాపం ఓపగలేనే

         

అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే.. ఏడే ఏడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3100

No comments:

Post a Comment