Wednesday, February 1, 2017

గట్టుకాడ ఎవరోచిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : జానకిపల్లవి :గట్టుకాడ... ఎవరో... చెట్టునీడ... ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు...  ఎవరో


గట్టుకాడ ఎవరో... చెట్టునీడ ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరోచరణం 1 :
ఓ...ఓ...
పోటుపాటు సూసుకొని ఏరు దాటి రావాలా
ముళ్ళు రాళ్ళు ఏరుకోని మందతోవ నడవాలా
ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో... సైగెందుకూ...ఏటిగట్టుకాడ... మావిచెట్టునీడ... ఎవరో... ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరో
చరణం 2 :
ఓ...ఓ..
పైరుగాలి పడుచుపైటా... పడగలేసి ఆడేను
గుండె పైనీ గుళ్ళ పేరు ఉండలేక ఊగేను


తోపు ఎనక రాచకొడక తొంగి చూసేవెందుకో...
నీవెందుకూ... సైగెందుకూ... 


ఏటిగట్టుకాడ... మావిచెట్టునీడ... ఎవరో... ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు..  ఎవరో 


No comments:

Post a Comment