Wednesday, February 1, 2017

కళ్ళు చూడు కళ్ళందం చూడు




చిత్రం :  బలిదానం (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 





పల్లవి : 


కళ్ళు చూడు కళ్ళందం చూడు
నడుము చూడు నడకందం చూడు
కళ్ళు చూడు కళ్ళందం చూడు
నడుము చూడు నడకందం చూడు


నాతో పోటీ ఎవరూ లేరయ్యో...
రంభా ఊర్వశి నిలపడలేరయ్యో



నవ్వు చూడు నవ్వందం చూడు...
మొగిలిరేకునా మీసం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు...
మొగిలిరేకునా మీసం చూడు


నాతో పోటీ ఎవరూ లేరమ్మో...
మన్మధుడైనా నా సరి కాదమ్మో



చరణం 1 :



పిల్లను చూస్తే పిటపిటమంటోంది....
నాలో కోరిక ఎపుడెపుడంటోంది... హా...


అందగాడ నువు తొందర చేస్తే... వేగేది ఎట్టా
ఉండీలేని నీ నడుమును చూస్తూ... ఆగేది ఎట్టా


కలలోకి నన్ను రప్పించుకో... తలదిండుతోనే సరిపుచ్చుకో
కలలోకైతే వస్తానన్నావ్... కౌగిలికైతే రాలేవా
జంటే లేని ఒంటరి వాణ్ణి పోనీలెమ్మని అనలేవా



కళ్ళు చూడు కళ్ళందం చూడు
నడుము చూడు నడకందం చూడు
కళ్ళు చూడు కళ్ళందం చూడు
నడుము చూడు నడకందం చూడు



నాతో పోటీ ఎవరూ లేరమ్మో... హహహ..
మన్మధుడైనా నా సరి కాదమ్మో.. హోయ్.. హోయ్.. హోయ్



చరణం 2 :


మాటలు చెప్పి మనసే దోచాడు...
లేదంటూనే ఇంతకు తెచ్చాడు... హహహహా


దొండపండు నీ పెదవిని చూస్తే... నాకేదో  కచ్చి
కన్నుగీటి నువు రమ్మంటుంటే... నాకేమో సిగ్గు


నా కచ్చికి... నీ సిగ్గుకి... ముడివేసి చూడు ఒక ముద్దుతోటి
నిన్నో మొన్నో కలిశాడు అపుడే ముద్దులు అడిగాడు
మొగమాటానికి ఔనన్నానా ఇంకా ఏదో అంటాడు


నవ్వు చూడు నవ్వందం చూడు...
మొగిలిరేకునా మీసం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు...
మొగిలిరేకునా మీసం చూడు



నాతో పోటీ ఎవరూ లేరమ్మో... హహహ..
మన్మధుడైనా నా సరి కాదమ్మో.. హోయ్.. హోయ్.. హోయ్






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2166

No comments:

Post a Comment