Wednesday, February 1, 2017

గోగులుపూచే గుట్ట మీదా

చిత్రం : ధర్మచక్రం (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా
హేయ్.. లబలబదియ్య

గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
సద్దు చెయ్యకా...  ముద్దులియ్యకా నిన్నిడిచిపెడతానటే...
హేయ్.. లబలబదియ్య

గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా  

చరణం 1 :

బొంగరాల బుగ్గ మీదా... ఊ..హూ..
నీ ఉంగరాల సిగ్గు చూస్తే.. ఊ..హూ..
ఎండమావి గుండెలోనా... ఊ..హూ
కొండవాగు వరదలైతే.. ఊ..హూ

వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..
వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..

చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...
చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...

హైలో హైలో హైలో హైలో.... సైలో సైలో సైలో సైలో...

చరణం 2 :

కొంటె చూపు ఎండలాడితే.. ఊ..హూ
నా దోర నవ్వు బేరమాడితే.. ఆహా
ఆ పూలబుట్ట వన్నెలన్నీ.. ఊ..హూ
నన్ను మాల కట్టి వేసుకోనీ.. ఊ..హూ.. 

దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో..  దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ..
దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో .. దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ.. 

రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు...
రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు... 

గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా

హేయ్.. లబలబదియ్య

గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
 
No comments:

Post a Comment