Wednesday, November 1, 2017

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ

చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది...  ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది

వీచే గాలుల తాకిడీ....  సాగే గువ్వల అలజడి...
రా రమ్మని పిలిచే పైబడి...ఈ... ఈ.. ఈ... ఈ.. ఈ.. 

చరణం 1 :

పసుపచ్చ లోగిలిలో...  పసుపుకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలో...  పసుపారబోసినట్టు

పాదాల పారాణి అద్దినట్టూ...
పాదాల పారాణి అద్దినట్టూ...
నుదిటిపై కుంకుమ దిద్దినట్టూ...

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది..
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది...

చరణం 2 :

పచ్చాపచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు

ఎర్రనీళ్ళు దిష్టి తీసిపోసినట్టూ...
ఎర్రనీళ్ళు దిష్టి తీసిపోసినట్టూ...
కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడీ....  సాగే గువ్వల అలజడి...
రా రమ్మని పిలిచే పైబడి...ఈ... ఈ.. ఈ... ఈ.. ఈ.. 

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... 

ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది.... ఈ... ఈ.. ఈ... 

No comments:

Post a Comment