Showing posts with label స్వయంవరం (1982). Show all posts
Showing posts with label స్వయంవరం (1982). Show all posts

Thursday, November 2, 2017

నేనిక్కడ నువ్వక్కడా

చిత్రం  :   స్వయంవరం (1982)
సంగీతం  :  సత్యం
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం  :  బాలు, సుశీల 


పల్లవి :



నేనిక్కడా...  నువ్వక్కడా
కనులిక్కడా...  కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు....


ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
 


నేనిక్కడా...  నువ్వక్కడా
కనులిక్కడా...  కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు....


ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
ఇంతే సంగతులు...  చిత్తగించవలెను 



చరణం 1 :



చూపులతో రాశాను...  నీకు ఉత్తరం
ఊపిరితో చేశాను...  చిలిపి సంతకం
చిరుగాలికి అందించాను...  నీకు ఇమ్మని
కలలోకైన ఒకసారి రమ్మని


చూశాను... చదివాను...  నీ జాబు
నీ చూపుల్లో చదువుకో నా జవాబు


ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
ఇంతే సంగతులు...  చిత్తగించవలెను


నేనిక్కడా...  నువ్వక్కడా
కనులిక్కడా...  కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు


ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
ఇంతే సంగతులు...  చిత్తగించవలెను 



చరణం 2 :




ఇవి కానే కావు...  కలం రాతలు
కలకాలం నిలిచేటి...  తీపి బాసలు
చిగురాశలు కురిపించే...  ప్రేమపత్రము
నిలవాలి ఎదలోనా...  జీవితాంతము


మాటాడే ... వేటాడే...  నీ నవ్వులు
నా మదిలోన కురవనీ తేనె జల్లులు


ఇంతే సంగతులు...  చిత్తగించవలెను
ఇంతే సంగతులు...  చిత్తగించవలెను


నేనిక్కడా...  నువ్వక్కడా
కనులిక్కడా...  కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు


ఇంతే సంగతులు...  ఉహుహుహు..
ఇంతే సంగతులు...  ఉహుహుహు.. 




 





Wednesday, November 1, 2017

హరివిల్లు పొదరిల్లు


చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల, శైలజ  


పల్లవి :



హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం

ఆ... అ... ఆ.. ఆ.. ఆ.. 




చరణం 1 :


ఆ... అహ.. ఆ.. ఆ..
ఓహో.. ఓ.. ఓ.. ఓ..

తలిరాకులు మొగ్గలుగా... చిరుమొగ్గలు పువ్వులుగా
అది నీ చిరునవ్వులుగా మారెను


నెలవంకే జాబిలిగా... ఆ జాబిలి వెన్నెలగా
అది నీ కొనచూపులుగా తోచెను


నీ చూపులలో...  నా నవ్వులలో
మధురిమలుగా పెరిగెను .. 


సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం 



చరణం 2 :




నీ అలకే సింధూరం... నీ పలుకే సంగీతం
నీ సొగసే అందాల బృందావనం


నీ మాటే మకరందం... నీ మనసే మందారం
నీ యదలో ఆణువణువూ నా సొంతం


తీయ తీయనిది...  వసివాడనది
మన ఇద్దరి అనుబంధం .. 


హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



ఆ... అహ.. ఆ.. ఆ..
ఓహో.. ఓ.. ఓ.. ఓ..







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2720

గాలి వానలో వాన నీటిలో

చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : ఏసుదాస్ 


పల్లవి :



గాలి వానలో...  వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం ... తెలియదు పాపం



గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ.... ఒఒఒ



చరణం 1 :



ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

హొరు గాలిలో వరద పొంగులో... సాగలేలని తెలుసు


అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

జోరు వానలో నీటి సుడులలో... మునక తప్పదని తెలుసు



అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో




చరణం 2 :



ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఆశ జారినా వెలుగు తొలిగినా... ఆగదు జీవిత పొరాటం


ఇది మనిషి మనసుల పోరాటం

అది ప్రేమ పెళ్ళి చెలగాటం

ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై... బ్రతుకుతున్నదొక శవం


అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం


గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2109

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ



చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :



ఆకాశం ఎందుకో పచ్చబడ్డది...  ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడీ....  సాగే గువ్వల అలజడి...
రా రమ్మని పిలిచే పైబడి...ఈ... ఈ.. ఈ... ఈ.. ఈ.. 



ఆకాశం ఎందుకో పచ్చబడ్డది...  ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడీ....  సాగే గువ్వల అలజడి...
రా రమ్మని పిలిచే పైబడి...ఈ... ఈ.. ఈ... ఈ.. ఈ.. 



చరణం 1 :



పసుపచ్చ లోగిలిలో...  పసుపుకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలో...  పసుపారబోసినట్టు


పాదాల పారాణి అద్దినట్టూ...
పాదాల పారాణి అద్దినట్టూ...
నుదిటిపై కుంకుమ దిద్దినట్టూ...


ఆకాశం ఎందుకో పచ్చబడ్డది..
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది...




చరణం 2 :



పచ్చాపచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు


ఎర్రనీళ్ళు దిష్టి తీసిపోసినట్టూ...
ఎర్రనీళ్ళు దిష్టి తీసిపోసినట్టూ...
కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..




ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
వీచే గాలుల తాకిడీ....  సాగే గువ్వల అలజడి...
రా రమ్మని పిలిచే పైబడి...ఈ... ఈ.. ఈ... ఈ.. ఈ.. 


ఆకాశం ఎందుకో పచ్చబడ్డది... 

ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది.... ఈ... ఈ.. ఈ...