Friday, December 1, 2017

అన్నయ్య సన్నిధి

చిత్రం :  బంగారు గాజులు (1968)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల




పల్లవి :


అన్నయ్య సన్నిధి...  అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే...  ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి... 



చరణం 1 :



ఒకే తీగ పువ్వులమై...  ఒకే గూటి దివ్వెలమై
ఒకే తీగ పువ్వులమై...  ఒకే గూటి దివ్వెలమై
చీకటిలో వేకువలో...  చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా...  కలసి మెలసి ఉన్నాము


అన్నయ్య సన్నిధి...  అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే...  ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి... 



చరణం 2 :



కలిమి మనకు కరువైనా... కాలమెంత ఎదురైన
కలిమి మనకు కరువైనా...  కాలమెంత ఎదురైన
ఈ బంధం విడిపోదన్న...  ఎన్నెన్ని యుగాలైన
ఆపదలో ఆనందంలో...  నీ నీడగ ఉంటానన్న


అన్నయ్య సన్నిధి...  అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే...  ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1703

No comments:

Post a Comment