Friday, November 10, 2017

రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా

చిత్రం : అనార్కలి (1955)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : జిక్కి, ఘంటసాల  

 


సాకి :


మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయన చకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి... 
అనార్కలి...  అనార్కలి... అనార్కలి ...
వహ్వా 
పల్లవి : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా.....
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..రాజశేఖరా 

ఆ.. ఆ.. ఆ...ఆ.. ఆ.. ఆఆ.. ఆ.. ఆ
 రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... చరణం 1 :మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మధురమైన బాధరా... మరపురాదు... ఆ...  ఆ..
 


రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... చరణం 2 :కానిదాన కాదురా...  కనులనైన కానరా
కానిదాన కాదురా...  కనులనైన కానరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
వేగ రారా...  వేగ రారా...  వేగ రారా.. 

No comments:

Post a Comment