Sunday, February 17, 2019

కళ్లలోన నీవే గుండెలోన నీవే

చిత్రం :  సింహ స్వప్నం (1989)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి :
 


కళ్లలోన నీవే...  గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే.. నీవే.. నీవే.. నీవే.. 


మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే.. కలిమివి నీవే... నా వెలుగువు నీవే


మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే.. నీవే..చరణం 1 :


నువ్వు నేనొక లోకము...  మనమెన్నడు వేరయ్యి ఉండము
నువ్వే ఆరో ప్రాణము.. నేనెరిగిన ఒకటే దైవము
పాలు తేనె లాగ కలిసి కరిగినాము
విడువ లేను నిన్ను... మరువ లేవు నన్ను
ఒకరికి ఒకరై...ఇద్దరం ఒకరై
ఉన్నాము నేడు...  ఉంటాము రేపు...  మనమేనాడు లేము


మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే..చరణం 2 :


నిజమై నిలిచిన స్వప్నమా...  నా బ్రతుకున వెలసిన స్వర్గమా
ఎన్నొ జన్మల బంధమా...  ఈ జన్మకు మిగిలిన పుణ్యమా
నువ్వే లేని నాడు... లేనే లేను నేను
ఎంత సంపదైన... నీకు సాటి రాదు
మెలుకువ నైన నిద్దుర నైన... ఒకటే ప్రాణం ఒకటే దేహం..మనదొకటే భావం


కళ్లలోన నీవే...గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న...మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే.. నీవే.. నీవే


మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే..నా వెలుగువు నీవే


No comments:

Post a Comment