Wednesday, June 5, 2019

కురులందే మేఘం విరిసి

 చిత్రం :  బాల నాగమ్మ (1981)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :   

నేపథ్య గానం :  బాలు 

పల్లవి :

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే

కులుకుల పరచెను రాగసుమాల.. 

కనులను చిలికెను మన్మధ లీలా

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే

చరణం 1 :

అలివేణి కాళ్ళే అందాలు కూర్చే 

అలివేణి కాళ్ళే అందాలు కూర్చే

నడకే అది ఒక నటనం 

నడకే అది ఒక నటనం... 

పరువాల చెలిపొంగు ఊరించు శృంగారం

జడ అలంకారం కలల అలలపై కదిలే రాగం

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే

చరణం 2 :

నందనందనందనందనం

నందనందనందనందనం

నం నం నం నం నం నం నం నం

నందందంద  నందందంద నందందంద  నందందంద నందనం.... 

కలికి మేని శిల్పసుందరం.. ఆ... ఆ.. ఆ..ఆ... ఆ.. ఆ.. 

కలికి మేని శిల్పసుందరం... నెలతి మోము ముగ్ధమోహనం

తంతనంతనం తంతనంతనం...  

కలికి మేని శిల్పసుందరం... నెలతి మోము ముగ్ధమోహనం

అతివ వయసు రాగమండపం.. చెలియ మనసు ప్రేమమందిరం

తంతనంతనం తంతనంతనం...

అతివ వయసు రాగమండపం.. చెలియ మనసు ప్రేమమందిరం

కోటి విరుల చెలి కమలం... తనన

శతకోటి రుచుల చెలి అమృతం... తనన

కోటి విరుల చెలి కమలం... తనన

శతకోటి రుచుల చెలి అమృతం... తననన 

అధరం నయనం నవరస కవితా భరితం

జిలిబిలి పూలబాలికల మధురగీతికల

అనంతస్వర వసంత వన మధు నిలయం

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే 

కులుకుల పరచెను రాగసుమాల.. 

కనులను చిలికెను మన్మధ లీలా

కురులందే మేఘం విరిసి కురిపించేను కవితలనే

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7512

No comments:

Post a Comment