Wednesday, June 5, 2019

జీవితం అన్న..మాటా

చిత్రం : చేసిన బాసలు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపథ్య గానం : బాలు, రామకృష్ణ , సుశీల






పల్లవి :





జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ సాగిపో... ఓ... ఓ


అహహాహహా ఆ..అహహాహహా ఆ
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ సాగిపో... ఓ... ఓ
జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా




చరణం 1 :




ఈ తమ్ముడే అన్న ప్రాణం... మా అన్న నా పాలి దైవం
ఈ తమ్ముడే అన్న ప్రాణం... మా అన్న నా పాలి దైవం


అమ్మను తలపించి... నాన్నను మరపించి
అమ్మను తలపించి... నాన్నను మరపించి... అండగ నిలిచావులే..


జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా






చరణం 2 :




సిరులేమీ నే కోరలేదూ... నీ చిరునవ్వులే నాకు చాలు...
సిరులేమీ నే కోరలేదూ... నీ చిరునవ్వులే నాకు చాలు... 


కొంగులు ముడివేసి... కోర్కెలు కలబోసి
కొంగులు ముడివేసి... కోర్కెలు కలబోసి...  నీతో అడుగేయనీ... 



జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా..




చరణం 3 :






ఏ జన్మలో పుణ్యఫలమో... ఏ దేవతల చూపు ఫలమో..
ఏ జన్మలో పుణ్యఫలమో...  ఏ దేవతల చూపు ఫలమో..


చల్లని నీచేయి... నిండుగా పేనవేయీ
చల్లని నీచేయి... నిండుగా పేనవేయీ
మాకీ  వరమీయారా..ఆ ఆ ఆ




జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ... సాగిపో..ఓ... ఓ
జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా 



2 comments:

  1. పాట విన్నతరువాత, నాకు ఈ పాటలోని మిగతా (బాలుగారు మినహా) రెండు గళములు సుశీలగారు, రామకృష్ణగారు అని అనిపించింది అండీ. మీరుకూడా ఒకసారి సరి చూడగలరు. వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను http://www.youtube.com/watch?v=C1xFvTA-7Z0&t=0m51s

    ReplyDelete
  2. సరి చేశాను మహేష్ గారు! ఎందుకో ఆ గళం రామకృష్ణ గారి గళంలాగా కాకుండా ఆనంద్ గారిలా అనిపించింది. Thanks

    ReplyDelete