Wednesday, January 8, 2020

ఏ రాగభావాలతో

చిత్రం : కొత్త దంపతులు (1984)
సంగీతం :  చక్రవర్తి   
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 




పల్లవి :



ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
అనురాగభావాల కలయికలో... తన పూల పొదరింటి అల్లికలో
పసివాళ్ళ రాగాల.. నూరేళ్ళ యోగాలు.. చేసేది సంసారమే


ఏ రాగభావాలతో... సంగీతముదయించునో




చరణం 1 :



ఈ ప్రేమ తాంబూలమిచ్చిందిలే... మా ఇంటికి తోరణమై తోచిందిలే
అది సూర్య దీపాల వెలుగాయెలే... ఈ కంటికి వేకువలే చూపిందిలే
ఎదలోనే హరివిల్లు వెలుగుల పుట్టిల్లు... ప్రేమానురాగాలకే విరిజల్లు
కుసుమించు కాలాలలో...
ఆ నాటి కలలన్నీ...  ఈనాడు కరిగించు కౌగిళ్ళ సంసారమే


ఏ తీపి స్వప్నాలతో...  సంసారముదయించునో...
తొలి పూజగా పూసే మల్లికలు... మలి పూజగా కొత్త కోరికలు
శ్రుతి మించు రాగాలు జత చేసి పాడాలి సంసార సంగీతమే


ఏ తీపి స్వప్నాలతో...  సంసారముదయించునో... 



చరణం 2 :



పెళ్ళిళ్ళు నూరేళ్ళ ఫలితాలనీ  ప్రేమించినవారికివే  పాఠాలనీ
ఆ ప్రేమే కరువైన లోగిళ్ళలో...  కన్నీరే కౌగిలిలో పొంగేనని... హా


పగలంతా పూజలకి...  రేయంతా మోజులకి...  

మావారు పంచారు ఇన్నాళ్ళకి
పరువాల పందిళ్ళలో... 

అనురాగ గీతాలు అమృతాభిషేకాలు...
కోరాలి సంసారమై... 


ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
అనురాగభావాల కలయికలో... తన పూల పొదరింటి అల్లికలో
పసివాళ్ళ రాగాల...  నూరేళ్ళ యోగాలు చేసేది సంసారమే


ఏ తీపి స్వప్నాలతో సంసారముదయించునో... 









https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6064

No comments:

Post a Comment