Tuesday, July 16, 2019

చిరుగాలి... చెప్పవే గొరవంకకి

చిత్రం : గ్రహణం విడిచింది (1980)
సంగీతం :  
రమేశ్ నాయుడు    

గీతరచయిత : మైలవరపు గోపి

నేపథ్య గానం :  బాలు, శైలజ



పల్లవి :



చిరుగాలి..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ
చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 1 :


ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
కలకంటి చూపులో చిందే...  వలపులే శీత కాటుకలు

నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ కమ్మని కౌగిలి నాదైతే రోజులు నిమిషాలు



చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 2 :



నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నీ నిండు మనుగడే.. నాకు పసుపు కుంకుమలు..


నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నీ చలవుంటే ఒకనాటికి నేను.. తల్లినవుతాను..


చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



No comments:

Post a Comment