Thursday, January 16, 2020

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా

చిత్రం :  అల్లరి పిల్లలు (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత :  కొసరాజు
నేపథ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  పెత్తనమంతా నాదే
ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... అధికారమంతా నాదే

చరణం 1 :

అప్పుడు రాముడు విల్లు విరిచెను జానకి కోసం
ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... హక్కుల కోసం

ఓ.. ఓ.. మహిషాసురిని మర్ధించే కాళి లోకం కోసం
మహిషాసురిని మర్ధించే కాళి లోకం కోసం
ఇక్కడ చిక్కినవన్నీ ముక్కలు చేస్తా  ప్రతిష్ట కోసం

హ..హా.. ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  పెత్తనమంతా నాదే
ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... అధికారమంతా నాదే

చరణం 2 :

ద్రౌపది శపధం దుశ్శాసనుని డొక్క చీల్చినది నాడు

ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా పచ్చడి చేస్తా నేడు
ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా పచ్చడి చేస్తా నేడు

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... అధికారమంతా నాదే
ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  పెత్తనమంతా నాదే

చరణం 3 :

తెలవాడి పనిపట్టెను  గాంధి....  జన్మహక్కు కోసం
విలన్ను తన్నెను ధర్మం కోసం ఎన్. టి. రామారావు

చూస్కో దెబ్బా... పోవోయ్ డబ్బా
మోసం సాగదు... ద్వేషం సాగదు
పోవే పో.. పోవే పో....
పో...పో...
పో...పో... 

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4671

No comments:

Post a Comment