చిత్రం : అల్లరి పిల్లలు (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
లలలలా.. లలలలా..
ఓ రాజులు... హోయ్ ఫోజులు.. ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే... నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు
ఓ బుల్ బులు... అహా జిల్ జిలు నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా... బొంబాయ్ రసగుల్లా మనసంతా నీమీదే ఉందే
చరణం 1 :
అహా.. మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో.. హెహెహీ
మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో
కొత్తదాన్ని వలచి పాతదాన్ని మరచి... మసిబూసిపోతారయ్యో....
ఓ రాజులు... హోయ్ ఫోజులు.. ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే... నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు
చరణం 2 :
అబ్బెబ్బే అలా కాదు... అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
అబ్బెబ్బే అలా కాదు... అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
ఉన్నదంతా ఇస్తా.. నా ప్రాణం ఒగ్గేస్తా ... నీ ఒళ్ళో వాలేస్తా....
ఓ బుల్ బులు... అహా జిల్ జిలు నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా... బొంబాయ్ రసగుల్లా మనసంతా నీమీదే ఉందే
ఉందే... ఉందే... ఉందే
చరణం 3 :
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా... విన్నా
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా...
నువ్వు యెస్ అంటే... నేను 'సై ' అంటే
అడ్దమే ఉందే లైలా
ఓ రాజులు... హోయ్... ఫోజులు.. ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
రంజురంజు పిల్లా... బొంబాయ్ రసగుల్లా మనసంతా నీమీదే ఉందే
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6174
No comments:
Post a Comment