Tuesday, January 21, 2020

నా గానం పసి ప్రాణం నిలిపేదైతే

చిత్రం :  అంకితం (1990)
సంగీతం :  యువరాజ్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు



పల్లవి :


నా గానం పసి ప్రాణం నిలిపేదైతే...  నా కంఠం నీ ఋణం తీర్చేదైతే
నా గానం పసి ప్రాణం నిలిపేదైతే...  నా కంఠం నీ ఋణం తీర్చేదైతే
ఇంకెందుకు సంకోచం... నీదే నా స్వరకోశం
ఇంకెందుకు సంకోచం... నీదే నా స్వరకోశం
గురుదేవా అందుకో తుదిగీతం... నా సర్వం నీకే అంకితం
అంకితం... అంకితం


చరణం 1 :


పలికే నా నాదంలో నీ పలుకే... వినలేదా
చిందే నా రక్తం ప్రతిబిందువులో నీ రూపం... కనపడలేదా
మట్టిముద్దనైన నన్ను మనిషిగా మలిచావే
తుమ్మెదను చేరదీసి తుంబురునిగ మార్చావే


గురుదేవా అందుకో తుదిగీతం... నా సర్వం నీకే అంకితం
అంకితం... అంకితం 


చరణం 2 :


తన కండలు తరిగి ఇచ్చి త్యాగమూర్తి అయినాడే.. శిభివిభుడు
తన బొటన వేలు నరికి ఇచ్చి పుణ్యమూర్తి అయినాడే.. ఏకలవ్యుడు
వారి అడుగుదారిలోనా నడిచే భాగ్యం...
నాకు వరమైతే ఈ శిష్యుని బ్రతుకే ధన్యం
నాకు వరమైతే ఈ శిష్యుని బ్రతుకే ధన్యం  


గురుదేవా అందుకో తుదిగీతం...
అవనీస్థలి సాక్షిగా అందుకో...
ఆకాశం సాక్షిగా అందుకో...
జీవాత్మ సాక్షిగా అందుకో...
పరమాత్మ సాక్షిగా అందుకో...


No comments:

Post a Comment