Monday, January 20, 2020

ప్రేమకు గాయం

చిత్రం :  అ ఆ ఇ ఈ (1994)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్యగానం :  బాలు



పల్లవి :


ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు
ప్రేమిస్తే నేరమా... హోయ్


ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు



చరణం 1 :


గలగల గోదారిలో అలలకు ఆయాసమై
కడలికి చేజారినా కలలకు ఆరాటమై
పొంగెను నీరే ఏరై... కన్నులలోనా


వలచిన తుల్లింతలే వగపుల బాలింతలై
తలచిన అక్షింతలే మిగలని రక్షింతలై
రేగెను గాలీవానా ఆమని వేళా
ప్రాణాలతో రాజీపడి సుఖించునా ప్రాయం



ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు
ప్రేమిస్తే నేరమా... హోయ్


ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు


చరణం 2 :


అడిగిన మాంగళ్యమే ముడిపడి పోనందిలే
అలదిన పారాణిలో తడిపొడి ఆరిందిలే
హారతి కర్పూరాలే ఆవిరులాయే

గుబులుగ ఓ కోకిలా శకునము చేదందిలే
దిగులుగ ఈ జంటకి మిథునము లేదందిలే
తాకని తారాతారా ఆకశమాయే
దైవాలతో పోటిపడి శపించె ఈ లోకం


ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు
ప్రేమిస్తే నేరమా... హోయ్


ప్రేమకు గాయం.. పెద్దల వినోదం
విరహపు వేసంగిలో చిరిగే మారాకులు
కలహపు కాళిందిలో మునిగే మారాజులు

No comments:

Post a Comment